Monday, November 4, 2024
HomeGovernmentగ్రాస్ శాలరీ, నెట్ శాలరీ, సీటీసీ శాలరీ అంటే ఏమిటి?

గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ, సీటీసీ శాలరీ అంటే ఏమిటి?

కొత్తగా ఉద్యోగంలో చేరినవాళ్లు, కార్పొరేట్ ప్రపంచంలోకి కొత్తగా అడుగు పెట్టిన వారు కంపెనీ వాళ్లకు సంస్థలో చేరే ముందు ఇస్తామని చెప్పిన దానికంటే తక్కువ జీతం ఇస్తున్నారు అని ఎక్కువ శాతం మంది ఫిర్యాదు చేస్తారు. గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ, సీటీసీ శాలరీ అనే మూడు పదాల మధ్య ఉండే వ్యత్యాసం వల్ల ఇలా జరుగుతుంది. ఈ మూడు ఒకేలా కనిపించినా, విభిన్న అర్థాలను కలిగి ఉంటాయి.

సీటీసీ అంటే ఒక ఉద్యోగి మీద కంపెనీ ఖర్చుకి సంబంధించినది. అందుకే, ఒక ఉద్యోగి తన చేతికి అందే జీతం మొత్తం గురించి ఆందోళన చెందుతాడు. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, దీనికి సంబంధించి మీ సందేహాలను మేము స్పష్టం చేస్తాము.

గ్రాస్ శాలరీ అంటే ఏమిటి?

  • ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటి మినహాయింపులు, ఆదాయపు పన్ను కోసం చేసిన కంట్రిబ్యూషన్లు వంటివి తీసేయకముందు మీ సంస్థ మీకు ఇచ్చే మొత్తం జీతాన్ని గ్రాస్ శాలరీ అంటారు.
  • ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీము. ఉద్యోగి మరియు యజమాని ఇద్దరూ ప్రతినెలా బేసిక్ జీతం, కరువు భత్యం నుంచి కనీసం 12% ఇందులో జమ చేస్తారు. మీ పదవి విరమణ సమయంలో, మీరు పూర్తి మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
  • ఇక మీరు ఉద్యోగం చేసే సమయంలో మీరు అందించిన సేవలకు ప్రతిఫలంగా రిటైర్మెంట్ సమయంలో, వేరే సంస్థకు బదిలీ అయ్యే సమయంలో అందించే మొత్తాని గ్రాట్యుటీ అంటారు. అయితే, మీరు ఆ సంస్థలో కనీసం 5 సంవత్సరాల పాటు పనిచేస్తేనే మీకు గ్రాట్యుటీ లభిస్తుంది. అయితే, కొన్ని పరిస్థితులలో 5 ఏళ్లు పనిచేయకున్న ఉద్యోగి మరణించినా/వైకల్యానికి గురైనా యజమాని ఉద్యోగికి పూర్తి గ్రాట్యుటీని చెల్లిస్తారు.

గ్రాస్ శాలరీలో ఏమి ఉంటాయి?

బేసిక్ శాలరీ: మీ శాలరీలో బోనస్లు, అలవెన్సులు మొదలైన ఇతర చెల్లింపులను జోడించడానికి ముందు, ఫిక్సిడ్ కంట్రిబ్యూషన్లు/పన్నులను మినహాయించక ముందు మీకు ఇచ్చే మొత్తమె బేసిక్ శాలరీ.

హౌస్ రెంట్ అలవెన్స్: ఉద్యోగ రీత్యా ఎవరైనా వారు ఉన్న ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి మారితే, అతను/ఆమె తీసుకున్న ఇంటి అద్దెకు పరిహారంగా ఇచ్చే మొత్తాన్ని హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు. ఈ అలవెన్స్ కు పాక్షికంగా పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. పన్ను నుంచి మినహాయించిన హెచ్ఆర్ఎ మొత్తం ప్రాథమిక శాలరీ నుంచి లెక్కించబడుతుంది.

- Advertisement -

ఇంకా లీవ్ ట్రావెల్ అలవెన్స్, టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ వంటివి ఉంటాయి.

నెట్ శాలరీ అంటే ఏమిటి?

నెట్ శాలరీ అంటే ప్రతి నెల మీ ఖాతాలో పడే జీతం. మీ గ్రాస్ శాలరీ నుంచి పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఆదాయపు పన్ను మొత్తం తీసివేసిన తర్వాత మీ చేతికి ఇచ్చే జీతాన్ని నెట్ శాలరీ అంటారు. నెట్ శాలరీని టేక్ హోమ్ శాలరీ అని కూడా అంటారు. ఇది అన్ని మినహాయింపుల తర్వాత మీకు లభిస్తుంది. ఉద్యోగంలో చేరక ముందు శాలరీ గురించి చర్చించుకునేప్పుడే టేక్ హోమ్ శాలరీ గురించి స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడే మీరు చేసే ఉద్యోగం మీకు సరిపడినంత ఆదాయాన్ని ఇస్తుందా లేదా అనే అంచనా వేయగలుగుతారు. ఇది అన్నింటి కంటే చాలా ముఖ్యమైనది.

కంపెనీకి అయ్యే ఖర్చు(సీటీసీ) అంటే ఏమిటి?

సీటీసీ అంటే ఒక సంవత్సరంలో యజమాని సగటున ఒక ఉద్యోగిపై ఖర్చు చేసే మొత్తం. ఉద్యోగులే కంపెనీకి విలువైన ఆస్తులు. నైపుణ్యం, అర్హత కలిగిన, సమర్థులైన ఉద్యోగులను నియమించుకోవడం చాలా ముఖ్యమైనది. కంపెనీ ఉద్యోగుల కోసం కంపెనీ తన డబ్బులో గణనీయమైన భాగాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కొత్త ఉద్యోగులను తమ కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపించడానికి వారికి ఆకర్షణీయమైన శాలరీని ఇవ్వవలసి ఉంటుంది. ఉద్యోగులు కంపెనీ కోసం తమ సామర్థ్యాన్ని, సమయాన్ని వెచ్చించి, కస్టపడి పనిచేస్తారు. కాబట్టి వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని ఆశిస్తారు. ఉద్యోగులు కంపెనీ ఎదుగుదల, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు.

కాబట్టి, పదవీ విరమణ తర్వాత సంస్థ కూడా ఉద్యోగుల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలని ఆశిస్తారు. అందుకే, యజమాని కూడా ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, గ్రాట్యుటీ వంటి వాటిలో కాంట్రిబ్యూట్ చేస్తారు. రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్ చేసిన కంట్రిబ్యూషన్లు కూడా సీటీసీలో చేర్చబడతాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles