Certified Copy of Document: మనలో చాలా మందికి ఇల్లు, భూములకు సంబంధించి ఎక్కువగా వాడే పదాల గురుంచి చాలా వరకు తెలియదు. ఈ పదాల గురుంచి తెలియకపోవడం వల్ల మనకు ఎంతో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇల్లు, భూములకు సంబంధించి ఎక్కువగా వాడే పదాలలో సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లో సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ గురుంచి తెలుసుకుందాం.
సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటే?
సర్టిఫైడ్ కాపీ అనేది ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్’కి సంబంధించిన నకలు అని అర్ధం. సులభంగా చెప్పాలంటే, మన భూమి లేదా ఇల్లుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్’కి సంబంధించిన ఒక జిరాక్స్ కాపీ అని అంటారు. దీని వల్ల ఒరిజినల్ డాక్యుమెంట్ పోయిన సందర్భాలలో లేదా మన భూమికి సంబంధించిన పాత రిజిస్ట్రేషన్ పత్రాలను పొందవచ్చు.
సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎక్కడ తీసుకోవాలీ?
సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ దగ్గరలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లభిస్తుంది. ఈ సర్టిఫైడ్ కాపీని రెండూ తెలుగు రాష్ట్రాలు ఆన్లైన్ ద్వారా కూడా అందజేస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా ఉచితంగా ఈ పత్రాలను మనం పొందవచ్చు.