కొన్ని సాంకేతిక కారణాలతో రాష్ట్రంలోని చాలా మందికి చెందిన భూములు ప్రభుత్వ నిషేధిత జాబితాలో పడుతున్నాయి. అలాగే, ఒక సర్వే నెంబర్‌లో ఒక్క ఎకరం కోర్టు కేసులో ఉన్నా.. సర్వే నెంబర్‌లోని మొత్తం భూమి నిషేధిత జాబితాలో చేరిపోయింది.
దీంతో ధరణి పోర్టల్ ద్వారా నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే సంబంధిత మండల తహసీల్దార్ నిషేధిత జాబితాలో లేదని రిపోర్ట్ ఇచ్చినట్లయితే.. ఆర్డీవో, డీఆర్వో, జేసీ, చివరకు కలెక్టర్ డిజిటల్ సంతకంతో నిషేధిత జాబితా నుంచి తొలిగిపోతుంది.
మీపై భూముల ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే ప్రభుత్వ నిషేధిత జాబితాలో నుంచి మన భూమును తొలగించుకునే అవకాశం ఉంది. మీకు ఇంటర్నెట్ మీద ఎలాంటి అవగాహన లేకపోతే మీ దగ్గరలోని మీ సేవకు వెళ్లి Government Prohibited Property List నుంచి మీ భూమీని తొలగించాలని పేర్కొనండి.
ఇక మీకు ఇంటర్నెట్ మీద అవగాహన ఉంటే, ధరణి పోర్టల్ క్లిక్ చేయండి. ఇప్పుడు TM Grievence relating to inclusion in prohibited properties List అనే ఆప్షన్ మీద ఆ తర్వాత ఈ క్రింద వీడియోలో పేర్కొన్న విధంగా చేయండి.
(ఇది కూడా చదవండి: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్ డబ్బులు!)