EPFO

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) తన చందారులకు త్వరలో శుభవార్త చెప్పేందుకు సిద్దం అవుతుంది. రూ.15,000కు పైగా మూలవేతనం ఉన్న ఉద్యోగులకు కొత్త పింఛను పథకం తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ 95 కింద పింఛను జమలకు రూ.15,000 వరకు మూలవేతనాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కనుక ఇంతకుమించి మూలవేతనం ఉన్న వారు చేరినా అది రూ.15వేలకే పరిమితం అవుతుంది. అలాంటప్పుడు పెన్షన్‌ ఖాతాకు ఎక్కువగా జమ చేయడం వీలు కాదు.

‘‘దీంతో నెలవారీగా రూ.15వేలకు మించి వేతనం ఉన్నా, తక్కువ జమ(8.33 శాతం) కావడం వల్ల వారు తక్కువ పెన్షన్‌ పొందాల్సి వస్తోంది’’ అని ఈపీఎఫ్‌ఓ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల నుంచి ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు. కానీ, మూలవేతనం ఎక్కువగా ఉన్న వారికి ఉపయోగకరంగా ఉండేలా మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతోంది. 2022 మార్చి 11, 12 తేదీల్లో గౌహతిలో జరిగే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

(ఇది కూడా చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!)