How To Withdraw Money from PF Account Online Telugu: కరోనా మహమ్మరి తర్వాత EPF ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. గతంలో అయితే, మీ ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేయాలంటే చాలా సుధీర్ఘ సమయం పట్టేది. కానీ, ఇప్పుడు కేవలం క్షణాలలో ధరఖాస్తు చేసుకోవడంతో పాటు, వారం రోజులలో మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.
అయితే, మీ ఖాతాలో ఉన్న డబ్బును విత్ డ్రా చేయాలంటే కచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ స్కాన్ కాపీతో పాటు, మీ చిరునామా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. EPF ఖాతా నుంచి డబ్బును పాక్షికంగా లేదా పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. ఒక వ్యక్తి పదవీ విరమణ చేసినప్పుడు లేదా అతను/ఆమె 2 నెలలకు పైగా నిరుద్యోగిగా ఉన్నప్పుడు పూర్తి మొత్తం విత్ డ్రా చేయవచ్చు.
అయితే, వైద్యపరమైన అవసరాలు, వివాహం, గృహ రుణం చెల్లింపు మొదలైన కొన్ని పరిస్థితులలో కొద్ది మొత్తాన్ని EPF ఖాతా ద్వారా విత్ డ్రా చేయవచ్చు. అయితే, మీ ఆధార్ మీ UANతో లింక్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఆన్‌లైన్ ద్వారా డబ్బును విత్ డ్రా చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా విత్‌డ్రా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా విత్‌డ్రా చేయాలి?
ఆన్‌లైన్‌లో EPF నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి మీ UAN నెంబర్ యాక్టివేట్ చేసి ఉండాలి. అలాగే, UAN నెంబర్తో మీ ఆధార్, పాన్ మరియు బ్యాంక్ వివరాలు లింక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇవి పాటించినట్లయితే మీ EPF ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేసుకోవచ్చు.
- మొదట మీరు మీ UAN నెంబర్ మరియు పాస్‌వర్డ్ సహాయంతో EPF పోర్టల్’లో లాగిన్ కావాలి.
- ఇప్పుడు ఈపీఎఫ్ మెనూ బార్’లో ఉన్న ‘ఆన్‌లైన్ సేవలు(Online Services)’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ మెను నుంచి ‘క్లెయిమ్ (ఫారం-31, 19,10C & 10D)’ ఎంచుకోండి.
- ఆ తర్వాత సభ్యుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతా నెంబర్ నమోదు చేసి, ‘వెరిఫై’పై క్లిక్ చేయండి
- ఇప్పుడు ‘ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- ఈపీఎఫ్ ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో డబ్బును విత్ డ్రా చేయడానికి ‘PF అడ్వాన్స్ (ఫారం 31)’ ఎంచుకోండి
- ఇప్పుడు మీరు ‘ఏ ప్రయోజనం కోసం అడ్వాన్స్ కావాలి’, అవసరమైన మొత్తం, ఉద్యోగి చిరునామాను నమోదు చేయాలి.
- ఉద్యోగి ఉపసంహరణకు అర్హత లేని కొన్ని ఎంపికలు ఎరుపు రంగులో కనిపిస్తాయని గమనించాలి.
- ఇప్పుడు మీరు పేర్కొన్న బ్యాంక్ పాస్ బుక్ ఫ్రంట్ పేజీ కాపీని(100 KB to 500 KB) అప్లోడు చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత కింద మూలన ఉన్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ ఆధార్ నెంబర్’కు లింకు అయిన మొబైల్ నెంబర్’కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి submit క్లిక్ చేయాలి.
- మీ యజమాని మీ విత్ డ్రా అభ్యర్థనను ఆమోదించాలి, ఆ తర్వాత మీ EPF ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా అయ్యి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
EPFOలో నమోదు చేసుకున్న మీ మొబైల్ నంబర్‌కు SMS నోటిఫికేషన్ కూడా వస్తుంది. క్లెయిమ్ ప్రాసెస్ చేసిన తర్వాత, ఆ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది. ప్రస్తుతం 3 నుంచి 5 రోజులలో ఈపీఎఫ్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
(ఇది కూడా చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇలా చేయకపోతే ఇక డబ్బులు జమ కావు?)