Sunday, September 15, 2024
HomeBusinessYvon Chouinard: రూ.24 వేల కోట్ల కంపెనీని దానంగా ఇచ్చేసిన నిజమైన శ్రీమంతుడు

Yvon Chouinard: రూ.24 వేల కోట్ల కంపెనీని దానంగా ఇచ్చేసిన నిజమైన శ్రీమంతుడు

Patagonia Founder Yvon Chouinard: ప్రకృతి ఇప్పటికి ప్రజలకు అవసరమైనవన్నీ ఇస్తూనే వస్తుంది. అయితే, కొం‍దరు వ్యాపార వేత్తలు తమ స్వార్థం కోసం భూమిపై ఉన్న వనరులను వినియోగించుకుంటూ అదే ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణం ప్రమాదంలో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పర్యావరణ పరిరక్షణ కోసం కొం‍దరు ముందడుగు వేసి తమ వంతు సాయం చేస్తున్నారు. ఆ జాబితాలోకి యోవోన్‌ చుయ్‌నార్డ్‌ వ్యక్తి వచ్చి చేరారు.

తాజాగా యూఎస్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మాత్రం తన కలలతో నిర్మించిన వేల కోట్ల కంపెనీని లాభాపేక్ష లేని ఓ ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నిజం. ఆ కంపెనీ విలువేదో రూ.వందకోట్లో, రూ.రెండొందల కోట్లో అనుకుంటే మీరు పొరపడినట్లే. అది మూడు బిలియన్‌ డాలర్ల విలువైన సంస్థ. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ.24వేల కోట్లు.

(ఇది కూడా చదవండి: మీ ఈపీఎఫ్‌ ఖాతాలో డబ్బులు డిపాజిట్‌ కాకపోతే.. ఇలా చేయండి?)

అమెరికాకు చెందిన ఆ సంస్థ పేరు పెటగోనియా. ఇదొక అవుట్‌డోర్ ఫ్యాషన్ సంస్థ. దీనిని 50 ఏళ్ల క్రితం యోవోన్‌ చుయ్‌నార్డ్‌ ప్రారంభించారు. కాలక్రమేణా ఆ కంపెనీ ఎదుగుతూ వస్తూ ప్రస్తుతం, మూడు బిలియన్ల డాలర్ల సంస్థగా రూపుదిద్దుకుంది.

అయితే, ఆ పెటగోనియా ఫౌండర్ యోవోన్‌ చుయ్‌నార్డ్‌ ఇప్పుడు దీని నుంచి వచ్చే ఆదాయాన్ని వాతావరణ మార్పులపై పోరాడే, జీవవైవిధ్యం, అటవీ భూముల సంరక్షణ కోసం పాటుపడే సంస్థలు, కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. పెటగోనియా సంస్థలో ఉన్న తమ వాటాలను కూడా ఇచ్చేందుకు ఆయన భార్యపిల్లలు కూడా ముందుకు వచ్చారు. మొత్తంగా పర్యావరణం కోసం సంస్థనే ట్రస్ట్‌గా మార్చారు.

- Advertisement -

(ఇది కూడా చదవండి: మీ ఈపీఎఫ్‌ ఖాతాలో డబ్బులు డిపాజిట్‌ కాకపోతే.. ఇలా చేయండి?)

పెటాగోనియో కంపెనీ ప్రతి సంవత్సరం సుమారు 1 బిలియన్‌ డాలర్ల విలువైన జాకెట్లు, స్కై ప్యాంట్లను అమ్మకాలు జరుపుతోంది. చుయ్‌నార్డ్‌ కుటుంబ వాటాతో పాటు, సంస్థ లాభాలు కూడా ట్రస్ట్‌’కు వెళ్తాయి. దాంతో ఆయన కుటుంబానికి ఎలాంటి ఆదాయం లభించదు. వాళ్లు బోర్డులో సభ్యులుగా కొనసాగుతూ, ట్రస్ట్ బాధ్యతలు చూసుకోనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles