తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని స్థలాలను క్రమబద్దీకరించేందుకు ప్రజలకు మరో అవకాశం కల్పించింది. ప్రజలు అక్టోబర్ 15వ తేదీ లోపు ఎల్ ఆర్ ఎస్ కోసం ఆన్ లైన్ లో సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లేఅవుట్లు చేయకుండానే క్రయవిక్రయాలు జరిపిన వారంతా తమ స్థలాలను క్రమబద్దీకరించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్నీ టీఎస్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సీ పాలిటీలు, గ్రామ పంచాయతీలకు వర్తిస్తుందని తెలిపింది.(చదవండి: భారతీయుల కోసం 6 సరికొత్త ఫీచర్ లను తీసుకొచ్చిన ఆపిల్)
లే అవుట్ ని క్రమబద్దీకరించేందుకు 10 వేల రూపాయలను ధరఖాస్తు రుసుంగా ప్రభుత్వం నిర్ణయించిది. వ్యక్తిగత ప్లాట్ క్రమబద్దీకరణ కోసం కనీస ధరఖాస్తు రుసుంగా 1000 రూపాయలను నిర్ణయించిది. 100 గజాల లోపు ఉన్నా స్థలాలకు గజానికి 200 రూపాయలు, 100 నుండి 300 గజాల లోపు ఉన్నా స్థలాలకు గజానికి 400 రూపాయలు, 300 నుండి 500 గజాల లోపు ఉన్నా స్థలాలకు గజానికి 600 రూపాయలు క్రమబద్దీకరణ రుసుంగా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ ఆర్ ఎస్ ధరఖాస్తు కోసం ఆన్లైన్(https://telanganalrsbrs.in/) లో అప్లై చేయండి.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.