Wednesday, October 16, 2024
HomeTechnologyMobilesపోగొట్టుకున్న/దొంగిలించబడిన మొబైల్ ఫోన్ ని కనిపెట్టడం ఎలా?

పోగొట్టుకున్న/దొంగిలించబడిన మొబైల్ ఫోన్ ని కనిపెట్టడం ఎలా?

ఈ మద్య కాలంలో ఫోన్ లా దొంగతనం అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నాయి లేదా మనం మన మొబైల్ ని బయటకి వెళ్ళినప్పుడు ఎక్కడో పెట్టి మరచిపోవడం జరగుతుంది. అయితే వీటిని నివారించడానికి కేంద్ర టెలీ కమ్యూనికేషన్ శాఖ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) అనే ఒక వెబ్ సైట్(https://ceir.gov.in)ని DoT(Department of Telecommunications) ప్రారంభించింది.

ఈ ఫోన్లను గుర్తించడానికి ఐఎంఈఐ నెంబర్ ను ఉపయోగించనున్నారు. ఈ విషయంపై DoT ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఐఎంఈఐ నంబర్ ను రీప్రోగ్రాం చేయడం సాధ్యమే. కొందరు అసాంఘిక శక్తులు దీన్ని ఆసరాగా చేసుకుని ఐఎంఈఐ నంబర్ క్లోన్ చేయడం ద్వారా నకిలీ ఐఎంఈఐ నంబర్లు ఉన్న ఫోన్లను ఉపయోగిస్తున్నారు.

ఇప్పటి వరకు క్లోన్ అయిన లేదా డూప్లికేట్ చేయబడిన ఐఎంఈఐ నంబర్ గల మొబైల్స్ కు సంబంధించి ఎన్నో కేసులు నమోదయ్యాయి’ అని ఆ ప్రకటనలో తెలిపింది. అలాంటి ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేస్తే, కొంతమంది నిజమైన వినియోగదారులు కూడా ఇబ్బందులు పడతారని, నకిలీ ఐఎంఈఐ నంబర్లు కల ఫోన్లు వినియోగంలో లేకుండా ఉండాల్సిన అవసరం ఉందని టెలీ కమ్యూనికేషన్ విభాగం ఆ ప్రకటనలో పేర్కొంది.(చదవండి: మీ ఫోన్ లో డీలిట్ చేసిన డేటాని తిరిగి పొందడం ఎలా?)

పోయిన మొబైల్ ఫోన్ ని బ్లాక్ చేయడం ఎలా?

  • మీరు ఎక్కడైతే మీ ఫోన్ ని కోల్పోతారో అక్కడ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఒక కంప్లయింట్ ఇచ్చిన తర్వాత మీరు దాని యొక్క కాపీని తీసుకోండి.
  • మీరు కోల్పోయిన నంబర్ కోసం మీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (ఉదా., ఎయిర్‌టెల్, జియో, వోడా / ఐడియా, బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్ఎల్) స్టోర్ కి వెళ్ళి ఒక కొత్త సిమ్ ని తీసుకోండి.  ఇది చాలా అవసరం ఎందుకంటే మీ IMEI ని బ్లాక్ చేసేటప్పుడు మీ మొబైల్ నంబర్‌ (OTP ఈ నంబర్‌పై పంపబడుతుంది) కు పంపిన otpని ఎంటర్ చేయడానికి.

గమనిక: TRAI యొక్క నిబంధన ప్రకారం, 24 గంటల సిమ్ యాక్టివేషన్ తర్వాత తిరిగి జారీ చేయబడిన సిమ్‌లపై SMS సౌకర్యం ప్రారంభించబడుతుంది.

- Advertisement -
  • మీ పత్రాలను సిద్ధం చేసుకోండి – పోలీసు రిపోర్ట్ కాపీ మరియు ఐడెంటిటీ ప్రూఫ్ తప్పక అందించాలి. మీరు మొబైల్ కొనుగోలు ఇన్వాయిస్ కూడా ఇవ్వవచ్చు.
  • పోగొట్టుకున్న / దొంగిలించబడిన ఫోన్ యొక్క IMEIని బ్లాక్ చేయడానికి అభ్యర్థన నమోదు ఫారమ్ నింపండి మరియు అవసరమైన పత్రాలను అటాచ్ చేయండి. ఫారమ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మీరు ఫారమ్‌ను నింపిన తర్వాత, మీకు ఒక అభ్యర్థన ID ఇవ్వబడుతుంది. మీ అభ్యర్థన యొక్క స్థితిని తనిఖీ చేయడానికి మరియు భవిష్యత్తులో IMEIని అన్‌బ్లాక్ చేయడానికి ఈ ఐడి అనేది ఉపయోగపడుతుంది.

ఫోన్ ని బ్లాక్ చేయమని చేసిన పిర్యాదు తర్వాత 24 గంటలలో మీ ‘ఐఎంఈఐ నంబర్’ ను బ్లాక్ చేస్తుంది. ఫోన్ బ్లాక్ చేయబడిన తరువాత, ఇది భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనూ ఉపయోగించబడదు. ఫోన్ పోయిందని మనం ఫిర్యాదు చేసిన వెంటనే ముందుగా ఆ ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేయడానికి TSP యొక్క పేర్కొన్న కస్టమర్ అవుట్లెట్ల ద్వారా, రాష్ట్ర పోలీసుల ద్వారా ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా కుదరకపోతే ఆ ఫోన్ ని బ్లాక్ చేస్తారు. ఇందుకోసం వివిధ మొబైల్ నెట్ వర్క్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం కలసి పనిచేస్తుంది. బ్లాక్ చేసిన మొబైల్ లో ఇతర నెట్ వర్క్ లకు సంభందించిన సిమ్ కార్డ్స్ కూడా పని చేయవు. ఆ ఫోన్ అనేది దేనికి పనికి రాకుండా పోతుంది.

ఒక వేల మీ అదృష్టం బాగుండీ ఫోన్ యొక్క IMEI దొరికినట్లయితే మరియు అది వినియోగదారు వద్ద ఉంటేనే దాన్ని అన్‌బ్లాక్ చేయాలి. కోల్పోయిన / దొంగిలించబడిన ఫోన్ యొక్క IMEI ని అన్‌బ్లాక్ చేయడానికి, అది దొరికినట్లు వినియోగదారు స్థానిక పోలీసులకు నివేదించాలి.

దాని తర్వాత ఈ వెబ్‌సైట్‌లో ఫారం సమర్పించాలి దాని కోసం ఫోన్ యొక్క IMEI ని అన్‌బ్లాక్ చేయడానికి అభ్యర్థన నమోదు ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. ఫారమ్‌కు వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, IMEI అన్‌బ్లాక్ చేయబడుతుంది. లేదంటే మీరు TSP పేర్కొన్న కస్టమర్ అవుట్‌లెట్ల దగ్గరికి వెళ్ళి ఆన్ బ్లాక్ చేసుకోవచ్చు.(చదవండి: మీ ఫోన్ లో డీలిట్ చేసిన డేటాని తిరిగి పొందడం ఎలా?)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles