Thursday, November 21, 2024
HomeBusinessWhat is EMI: ఈఎమ్ఐ అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు..?

What is EMI: ఈఎమ్ఐ అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు..?

How To Calculate Home Loan EMI in Telugu: ప్రస్తుతం మనలో చాలా మంది ఈఎమ్ఐ(EMI) అనే పదం గురించి ఎక్కువ సార్లు విని ఉంటారు. కానీ, దాని అర్థం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే, మనం ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

What is EMI: ఈఎమ్ఐ అంటే ఏమిటి?

ఈఎమ్ఐ(EMI) అంటే “సమానంగా పరిగణించు నెలసరి వాయిదా”, రుణగ్రహీత ప్రతి నెలా రుణదాతకు చెల్లించే వాయిదా మొత్తాన్ని ఈఎమ్ఐ అంటారు. ఇంకా అర్ధం అయ్యే విధంగా చెప్పాలంటే.. రుణ గ్రహీత నుంచి తీసుకున్న ప్రధాన మొత్తానికి వడ్డీ కలిపగా వచ్చిన మొత్తాన్ని నెలలు సంఖ్యతో విభజించిన తరువాత.. వాయిదాలలో డబ్బు కట్టే విధానాన్ని ఈఎమ్ఐ అంటారు.

How To Calculate Home Loan EMI: హోమ్ ఈఎమ్ఐని ఎలా లెక్కిస్తారు..?

ఈ ఈఎమ్ఐని అనేది కారు లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ వంటి వివిద రుణాల మీద దీనిని లెక్కిస్తారు. ఈఎమ్ఐని లెక్కించే ప్రక్రియ ప్రతి బ్యాంకును బట్టి మారుతుంది. బ్యాంక్ అందించే వడ్డీ రేట్లపై ఆధారపడి.. మీరు తీసుకున్న లోన్ మొత్తం చెల్లించే కాల పరిమితిని బట్టి ఈఎమ్ఐ ఉంటుంది.

(ఇది కూడా చదవండి: Home Loan Documents List: హోమ్ లోన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి?)

ఈఎమ్ఐని లెక్కించడం అనేది ప్రధానంగా రెండు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ప్రధాన మొత్తం మీద విధించే వడ్డీ రేటుతో పాటు, రుణం తిరిగి చెల్లించే వ్యవధి మీద ఆధారపడి ఈఎమ్ఐ(EMI) ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

Home Loan EMIకి ఉదాహారణ:

  • రుణ మొత్తం రూ.10, 00.000
  • ఏడాదికి వడ్డీ రేటు: 12%
  • రుణ కాలం(n) = 15 సంవత్సరాలు = 180 నెలలు
  • పైన అప్పుగా తీసుకున్న మొత్తం = రూ. 10 లక్షలు, ఏడాదికి వడ్డీ రేటు = 12 శాతం, రుణ కాలం = 15 ఏళ్లు (180 నెలలు)
  • ఇప్పుడు మీ పైన పేర్కొన్న ప్రకారం చూస్తే సుమారు రూ.12 వేలకు వరకు ఉంటుంది.
  • అయితే, ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి బ్యాంకులు మీకు వచ్చే నెల జీతంలో ఈఎమ్ఐ మొత్తాన్ని 50 శాతం వరకు ఉండేలా చూసుకుంటాయి.
  • పైన మీరు గమనిస్తే మీ ఈఎమ్ఐ రూ.12 వెలుగా ఉంది, అంటే మీ నెలసరి జీతం కచ్చితంగా రూ. 24 వేలు ఉండాలి.

Types of EMI: ఈఎమ్ఐ ఎన్ని రకాలు

ఈఎమ్ఐ తిరిగి చెల్లించే విధానంలో బ్యాంకులు రెండు రకాలైన పేమెంట్ విధానాల్ని అవలంబిస్తున్నాయి. అవి

  1. ఫిక్స్‌డ్ రేట్ ఈఎమ్ఐ
  2. ప్లోటింగ్ రేట్ ఈఎమ్ఐ

ఫిక్స్‌డ్ రేట్ ఈఎమ్ఐ అంటే ఏమిటి?

ఫిక్స్‌డ్ రేట్ ఈఎమ్ఐ అంటే రుణ గ్రహీత ఈఎమ్ఐ చెల్లించే పదవీకాలం మొత్తం ఒకే ఈఎమ్ఐని చెల్లిస్తుంటాడు. ద్రవ్యోల్పణంతో సంబంధం లేకుండా ప్రతి నెల చెల్లించే EMI మొత్తం ఒకే విధంగా ఉంటుంది. ఆర్బిఐ రేపో రేటుతో కూడా ఎలాంటి సంబంధం ఉండదు. అయితే, ప్రస్తుత ప్లోటింగ్ వడ్డీ రేటు 2-3 శాతం ఎక్కువగా ఉంటుంది.

ప్లోటింగ్ రేట్ ఈఎమ్ఐ అంటే ఏమిటి?

ప్లోటింగ్ రేట్ ఈఎమ్ఐ అంటే మార్కెట్, ఎకానమీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటు విధానాలకు అనుగుణంగా ఈఎమ్ఐ ప్రతి నెల మారుతూ ఉంటుంది. కాకపోతే, మీరు రుణం తీసుకునే సమయంలో ఫిక్స్‌డ్ రేట్ ఈఎమ్ఐ అనేది 2 -3% అనేది తక్కువగా ఉంటుంది.

గమనిక: ప్రస్తుత హోమ్ లోన్, పర్సనల్ లోన్ వంటి అనేక రుణాల ఈఎమ్ఐలను రుణాలను లెక్కించడానికి చాలా EMI Calculators అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles