Sunday, October 13, 2024
HomeHow Toధరణిలో అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

ధరణిలో అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

Check eChallan or Application Status in Dharani Portal: తెలంగాణలో ఆస్తి వివరాల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2020లో ధరణి పోర్టల్‌ను లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పోర్టల్ ద్వారా కేవలం ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే కాకుండా.. ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.

(ఈ ఆర్టికల్ కూడా చదవండి: Dharani Portal: తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు చెక్ చేసుకోవడం ఎలా?)

అయితే, కొత్తగా తీసుకొచ్చిన ఈ ధరణి వెబ్ సైట్ వల్ల చాలా సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. ధరణి పోర్టల్‌లో ఉన్న భూముల వివరాలు సరిగా లేకపోవడం, ఆన్‌లైన్‌లో వేలాది సర్వే నంబర్లు మిస్ కావడం, ఒకరి భూములు మరొకరి పేర్లపై నమోదు కావడం, పాత పట్టదారుల పేరిట కొత్త పాస్ బుక్కులు జారీ కావడం వంటి అనేక సమస్యలు పుట్టుకొచ్చాయి.

అయితే, ఈ ధరణి వెబ్ సైట్ వల్ల ఎదురైన సమస్యలను పరిషకరించేందుకు CCLAకు, జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలను ఇచ్చింది. ధరణిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రైతులు ఆ పోర్టల్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని గతంలో పేర్కొంది. రైతులు తమ ధరఖాస్తు స్థితిని కూడా తెలుసకునేందుకు ప్రత్యేక ఆప్షన్ ఇచ్చింది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ధరణిలో దరఖాస్తు స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?

  • ముందుగా మీరు ధరణి అధికారిక పోర్టల్ https://dharani.telangana.gov.in/ ఓపెన్ చేయండి
  • ఓపెన్ అయిన తర్వాత Agriculture ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఎడమ వైపు, క్రింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • మీకు కనిపిస్తున్న ఆప్షన్లలో eChallan/Application Status మీద క్లిక్ చేసి CLICK HERE TO CONTINUE అనే దాని మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు Application Typeలో మీరు దరఖాస్తు చేసుకున్న Applicationని ఎంచుకోండి.
  • ఆ తర్వాత Application Number / Transaction ID నమోదు చేయండి.
  • చివరిగా Captcha కోడ్ నమోదు చేసి Fetch Details మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.

Note: ధరణిలో ఏదైనా సమస్య ఉంటే క్రింద మీ పేరు, మొబైల్ నెంబర్ కామెంట్ చేయండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles