PM Kisan Maandhan Yojana Scheme Farmers to Get Monthly Pension: మన దేశంలో రైతుకు అండగా నిలబడటం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది. రైతులకు తక్కువ వడ్డీకే రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను ఇస్తోంది. పెట్టుబడి సాయం కోసం పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తుంది.
(ఇది కూడా చదవండి: పీఎం కిసాన్ ఈ-కేవైసీ కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా..?)
అలాగే, వయసు పైబడిన రైతులకు ఆర్థికంగా తోడుగా నిలవాలనే ఉద్దేశంతోనే అమలు చేస్తున్న కీలక పథకమే ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన(PM Kisan Mandhan Yojana). ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన రైతులు నెలకు కనీసం రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందచ్చు. ఈ పథకంలో చేరడానికి కావాల్సిన అర్హతలు గురించి తెలుసుకుందాం.
పీఎం కిసాన్ మంధన్ యోజనకు ఎవరు అర్హులు..?
- దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత భూ రికార్డుల్లో మీ పేరు కచ్చితంగా ఉండాలి.
- రైతు పేరు మీద 2 హెక్టార్ల భూమి ఉండాలి.
- రైతు వయస్సు 18-40 మధ్య ఉండాలి.
- 60 ఏళ్లు దాటాక ఈ పథకం కింద నెలకు కనీస పింఛను రూ.3 వేలు అందుతుంది.
- ఒక వేల అర్హుడైన వ్యక్తి మరణిస్తే అతడి జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ వస్తుంది.
ఎంత కట్టాలంటే?
అర్హుడైన రైతు తనకు 60 ఏళ్లు వచ్చేంత వరకు నెలకు రూ.55 నుంచి రూ.220 వరకు చెల్లించాల్సి ఉంటుంది. రైతుకు 60 ఏళ్లు నిండగానే పెన్షన్ కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అనంతరం ప్రతి నెలా రైతు బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని జమ చేస్తుంది.
పీఎం కిసాన్ మంధన్ యోజనకు ఎవరు అనర్హులు..?
నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS), ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో పథకం తో పాటు ఏ ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకాల నుంచి లబ్ది పొందుతున్న వారు.. జాతీయ పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు అనే విషయం గుర్తుంచుకోవాలి.
పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన ధరఖాస్తుకు కావాల్సిన దృవ పత్రాలు:
ఈ పథకంలో చేరాలంటే దరఖాస్తుదారుడు ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పేరు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, జీవిత భాగస్వామి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అర్హత గల రైతులు తమ ప్రాంతంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్/ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.