Thursday, November 21, 2024
HomeHow ToEncumbrance Certificate: ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో వాడే పదాల గురించి మీకు తెలుసా?

Encumbrance Certificate: ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో వాడే పదాల గురించి మీకు తెలుసా?

Terms Used in Encumbrance Certificate (EC): ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ అంటే ఒక భూమికి సంబంధించిన ప్రతి లావాదేవిని తెలియజేసే ఒక ముఖ్యమైన ఆస్తి పత్రం. ఈ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో సదురు భూమికి సంబంధించిన పూర్తి చరిత్ర ఉంటుంది. ఒక భూమి ఎంత మంది చేతులు మారింది అనేది ఇందులో క్షుణ్ణంగా తెలుస్తుంది.

అయితే, ఇంత వరకు భాగానే ఉన్న చాలా మందికి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో వాడే పదాల గురించి ఒక అవగాహన ఉండదు. మనం ఒక భూమిని లేదా ఇల్లును కొనేటప్పుడు ఈసీలో వాడే పదాల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మనం ఇప్పుడు ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో వాడే పదాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Sale Deed – సేల్ డీడ్ అంటే ఏమిటి?

  • EX – Executant (భూమి అమ్మే వ్యక్తి)
  • CL – Claimant (భూమి కొనే వ్యక్తి)

ఎవరైనా ఒక వ్యక్తి ఇతరుల నుంచి భూమిని కొనుగోలు చేసినప్పుడు రూపొందించుకునే అగ్రీమెంట్ పత్రాన్ని సేల్ డీడ్ అని అంటారు. సేల్ డీడ్’లో EX – Executant అంటే భూమి అమ్మే వ్యక్తి అని అర్థం, అదే CL – Claimant అంటే భూమి కొనే వ్యక్తి అని అర్థం.

Mortagage Deed – మార్ట్‌గేజ్ డీడ్ అంటే ఏమిటి?

  • MR – Mortgagor (Present Owner or Borrower – రుణం తీసుకునే వ్యక్తి )
  • ME – Mortgagee (Financier – రుణం ఇచ్చే సంస్థ)

ఒక వ్యక్తి భూమి కొన్న తర్వాత తన అవసరం నిమిత్తం బ్యాంకు నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకునేటప్పుడు రూపొందించుకునే అగ్రీమెంట్ పత్రాన్ని మార్ట్‌గేజ్ డీడ్ అని అంటారు. ఈ డీడ్లో MR – Mortgagor అంటే ఒక బ్యాంకు నుంచి రుణం తీసుకునే వ్యక్తి అని అర్థం, అదే ME – Mortgagee అంటే అప్పు ఇచ్చే సంస్థ పేరు అని అర్థం.

- Advertisement -

Release Deed – రిలీజ్ డీడ్ అంటే ఏమిటి?

  • RR – Releasor [ Previous Owner or Financier – రుణం ఇచ్చిన సంస్థ- డబ్బు తీసుకొని హక్కును వదులుకోవడం ]
  • RE – Release [ Present Owner or Financier – రుణం తిరిగి చెల్లించిన వ్యక్తి – డబ్బు చెల్లించే వ్యక్తి ]

ఎవరైతే భూమి తనఖా పెట్టి రుణం తిరిగి చెల్లిస్తారో అప్పుడు రూపొందించుకునే అగ్రీమెంట్ పత్రాన్ని రిలీజ్ డీడ్ అని అంటారు. ఈ డీడ్’లో ఉపయోగించే RR – Releasor అంటే రుణం ఇచ్చిన సంస్థ లేదా డబ్బు తీసుకొని హక్కును వదులుకోవడం, అలాగే, RE – Release రుణం తిరిగి చెల్లించిన వ్యక్తి లేదా డబ్బు చెల్లించే వ్యక్తి అని అర్థం.

(ఇది కూడా చదవండి: ఇల్లు, భూమి కొనేముందు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(EC), ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్(OC) ఎందుకు ముఖ్యం?)

Gift Deed – గిఫ్ట్ డీడ్ అంటే ఏమిటి?

  • DR – Donor [ దాత, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆస్తిని తనకు నచ్చిన వారికి ఇచ్చే వ్యక్తి ]
  • DE – Donee [ గ్రహీత, ఉచితంగా లేదా బహుమానం రూపంలో భూమి పొందే వ్యక్తి ]

ఇక ఒక తన ఇష్ట పూర్వకంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రూపొందించుకునే అగ్రీమెంట్ పత్రాన్ని గిఫ్ట్ డీడ్ అని అంటారు. ఈ డీడ్’లో DR – Donor అంటే దాత, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆస్తిని తనకు నచ్చిన వారికి ఇచ్చే వ్యక్తి, అదే DE – Donee గ్రహీత, ఉచితంగా లేదా బహుమానం రూపంలో భూమి పొందిన వ్యక్తి.

General Power of Attorney Deed – జీపీఏ అంటే ఏమిటి?

  • PL – Principal ( డబ్బులు తీసుకోకుండా భూ హక్కులను బదలాయించే వ్యక్తి )
  • AY – Attorney (Agent of Principal – హక్కును మాత్రమే పొందే వ్యక్తి )

ఒక వ్యక్తి తన భూమిపై హక్కులను ఇతరుల పేరు మీద మార్చేటప్పుడు రూపొందించుకునే అగ్రీమెంట్ పత్రాన్ని జీపీఏ అని అంటారు. ఈ జీపీఏలో PL – Principal అని అంటే డబ్బులు తీసుకోకుండా భూ హక్కులను బదలాయించే వ్యక్తి, AY – Attorney లేదా Agent of Principal అంటే హక్కును పొందే వ్యక్తి అని అర్థం.

Lease Deed అంటే ఏమిటి?

  • LR – Lessor (ఆస్తిని లీజుకు ఇచ్చే వ్యక్తి)
  • LE – Leasee ( ఆస్తిని లీజుకు తీసుకునే సంస్థ లేదా వ్యక్తి)

ఒక ఇల్లును లేదా భూమిని లీజుకు ఇచ్చేటప్పుడు రూపొందించుకునే అగ్రీమెంట్ పత్రాన్ని లీజు డీడ్ అని అంటారు. దీనిలో LR – Lessor అని అంటే ఆస్తిని లీజుకు ఇచ్చే వ్యక్తి, LE – Leasee అంటే ఆస్తిని లీజుకు తీసుకునే సంస్థ లేదా వ్యక్తి అని అర్థం.

ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో వాడే మిగతా పదాలు:

  • E – Execution Date (E)
  • R – Registration Date (R)
  • P – Presentation Date (P)
  • FP – First Party
  • SP – Second Party
  • EP – Execution Proceedings
  • DDP – Detailed Development Plan
  • DTCP – Department of Town and Country Planning
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles