Aadhaar Card
Name Change in Aadhaar Card

Name Change in Aadhaar Card Online: ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్డు ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో కీలకంగా మారిపోయింది. ఏ చిన్న పనికైనా మీ ఆధార్ కార్డు చూపించాల్సిందే. రేషన్ కార్డు నుంచి బ్యాంకు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వరకు అన్ని ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరిగా మారిపోయింది.

(ఇది కూడా చదవండి: Aadhaar Update: ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మార్చుకోవడం ఎలా..?)

ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే కూడా ఇప్పుడు ఆధార్ నంబర్ ఉండాల్సిందే. అయితే, ఆధార్ కార్డులో గనుక మీ పేరు తప్పు పడితే జరిగే నష్టాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే, కీలకమైన ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా?

  • ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్(https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి.
  • ఇప్పుడు హోం పేజిలోని My aadhaar సెక్ష‌న్‌లో Update your aadharపై క్లిక్ చేయాలి
  • ఆ త‌ర్వాత Update Demographics Data Onlineపై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత ఆధార్ సెల్ఫ్ స‌ర్వీస్ అప్‌డేట్ పోర్ట‌ల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు కనిపించే Proceed to Update Aadhaarపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు ఆధార్ నంబ‌ర్‌, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి Send OTPపై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని అక్క‌డ నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • అందులో నేమ్ చేంజ్ ఆప్ష‌న్ ఎంచుకుని మారిన పేరు, ఇంటి పేరు వివ‌రాలు ఎంట‌ర్ చేయాలి.
  • ఆ త‌ర్వాత అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
  • అప్పుడు మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్‌కు ఒక ఓటీపీ వ‌స్తుంది. ఆ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి వెరిఫై మీద ప్రెస్ చేయాలి.
  • ఈ మొత్తం ప్రాసెస్‌కు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.
  • ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయ‌గానే ఒక స‌ర్వీస్ రిక్వెస్ట్ నంబ‌ర్(SRN) వ‌స్తుంది.‌ ఈ SRN నంబ‌ర్ ద్వారా అడ్ర‌స్ అప్‌డేష‌న్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌చ్చు.

ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా?

  • ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చ‌డానికి ముందుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
  • ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు నేరుగా వెళ్లొచ్చు.. లేదా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని నిర్ణీత స‌మ‌యానికి వెళ్లొచ్చు.
  • ఆధార్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. మ‌న ఆధార్ నంబ‌ర్ ద్వారా మ‌న‌కు అందుబాటులో ఉన్న ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌లో.. మ‌న‌కు వీలైన టైంకు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవ‌చ్చు.
  • ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్‌కు వెళ్లేప్పుడు త‌ప్ప‌నిసరిగా కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఒరిజిన‌ల్స్‌ను తీసుకెళ్లాలి అనే విషయం గుర్తుంచుకోవాలి.
  • ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్ సిబ్బంది ఒరిజిన‌ల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని తిరిగి ఇచ్చేస్తారు.
  • ఆధార్‌లో కొత్త పేరు, ఇంటి పేరు ఎలా ఉండాలో సిబ్బందికి చెప్పి మార్పించుకోవాలి.
  • అవ‌స‌ర‌మైతే బ‌యోమెట్రిక్ డేటాను కూడా అప్‌డేట్ చేస్తారు.
  • ఈ ప్రాసెస్‌కు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం కోసం ఏ డాక్యుమెంట్లు అవ‌స‌రం?

సాధార‌ణంగా పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓట‌ర్ ఐడీ, రేష‌న్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా ప్ర‌భుత్వ గుర్తింపు కార్డు(ఫొటోతో ఉన్న‌వి), విద్యాసంస్థ‌ల ఐడీ కార్డులను కూడా ప్రూఫ్‌గా స‌బ్‌మిట్ చేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here