MG Comet EV Detail in Telugu: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని ‘కామెట్’ ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. గుజరాత్‌లోని తన హలోల్ ప్లాంట్లో వీటిని ఈవీని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన జీస్‌ఈవీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, సాలిడ్ స్టీల్ ఛాసిస్‌పై నిర్మించిన ‘హై స్ట్రెంగ్త్ వెహికల్ బాడీ’తో దీనిని తయారు చేస్తారు.
కాంపాక్ట్ కామెట్ ఈవీ లాంచ్ ఎప్పుడు?
తమ కాంపాక్ట్ కామెట్ ఎలక్ట్రిక్ కారు దేశీయ పోర్ట్‌ఫోలియోలో అతి చిన్న వాహనమని, మార్కెట్లో విక్రయించే అతి చిన్న ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం కూడా అవుతుందని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 19న ఇండియాలో దీన్ని లాంచ్ చేయనుంది. కామెట్ ఈవీ ధరలను రాబోయే రెండు నెలల్లో ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
కాంపాక్ట్ కామెట్ ఈవీ అంచనా ధర:
17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానున్న ఎంజీ కామెట్ ధర దాదాపు రూ.10 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల నీల్సన్ నిర్వహించిన అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఈవీలకు ఆధరణ పెరుగుతుంది.
కామెట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ (IoV), మల్టీమీడియా, కనెక్టెడ్ ఫీచర్లతో సహా GSEV ప్లాట్‌ఫారమ్‌ను పూర్తి చేసే వివిధ స్మార్ట్ ఫీచర్లున్నాయని కంపెనీ పేర్కొంది. కాగా లాంచింగ్‌కు ముందు కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం దీనిలో డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ డిజైన్‌తో పాటు డాష్‌బోర్డ్, స్టీరింగ్ రెండు వైపులా మౌంటెడ్ రెండు-స్పోక్ డిజైన్స్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్యాబిన్‌లో బాక్సీ డిజైన్ ఎల్‌ఈడీహెడ్‌లైట్‌లు ,టెయిల్ లైట్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైని ఇతర ఫీచర్లు ఉన్నాయి.