What Is Property Tax, How Much Is Property Tax in Telangana
Property Tax in Telangana

Property Tax in Telangana: మన దేశంలో ప్రతి పౌరుడు ఆస్తి పన్ను ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఆస్తి పన్ను ద్వారా సేకరించిన నిధులను మీ ప్రాంతం అభివృద్ధికి ఉపయోగిస్తారు. అయితే, మనం ఇప్పుడు ఈ కథనంలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Table of Contents

ఆస్తి పన్ను అంటే ఏమిటి?

ఆస్తి పన్ను అనేది ఒక భూ యజమాని తన దగ్గరలోని స్థానిక సంస్థ లేదా మునిసిపల్ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన ఒక వార్షిక పన్ను. ఈ పన్ను సాధారణంగా దేశంలోని మునిసిపల్ ప్రాంతం బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఆస్తి పన్నుతో రాష్ట్ర మునిసిపల్ సంస్థలు ఆ ప్రాంత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తాయి.

ఆస్తి పన్నులో భాగాలు

CDMA తెలంగాణ ఆస్తి పన్నులో 4 భాగాలు ఉన్నాయి: సాధారణ పన్ను, నీరు మరియు పారుదల పన్ను, లైటింగ్ పన్ను మరియు స్కావెంజింగ్ పన్ను.

ఆస్తి పన్నును ఏ విధంగా లెక్కిస్తారు:

ఆస్తి పన్ను అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పన్ను రేటు, దీనిని మీ ఆస్తి వార్షిక అద్దె విలువ ఆధారంగా లెక్కిస్తారు. పన్ను రేటు కూడా ఆస్తి వార్షిక అద్దె విలువపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రం, నగరం, పట్టణం, మండలాల వారీగా పన్ను రేటు మారుతూ ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలి.

ఆస్తి వార్షిక అద్దె విలువను ఏ విధంగా లెక్కిస్తారు:

  • ఆస్తి ఉన్న ప్రాంతం
  • ఆస్తి రకం: నివాస/ నివాసేతర
  • నిర్మాణ సంవత్సరం
  • నిర్మాణ రకం

తెలంగాణలో ఆస్తి పన్ను రేటు ఎంత ఉంటుంది?

తెలంగాణలో నివాస భవనాల విషయంలో పన్ను రేటు క్రింది విధంగా ఉంటుంది:

ఆస్తి వార్షిక అద్దె విలువఆస్తి పన్ను రేటు
రూ. 601-రూ. 120017%
రూ. 1201-రూ. 240019%
రూ. 2401-రూ. 360022%
రూ 3600 <30%

600 రూపాయల వరకు వార్షిక అద్దె విలువ కలిగిన ఆస్తికి తెలంగాణలో ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఉంది.

(ఇది కూడా చదవండి: Home Loan Documents List: హోమ్ లోన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి?)

తెలంగాణలో వాణిజ్య ఆస్తిపై 30% ఫ్లాట్ రేటుతో పన్ను విధిస్తారు. అలాగే ఏప్రిల్ 30లోపు సంవత్సరపు వార్షిక ఆస్తి పన్నును ముందుగానే చెల్లించడం వల్ల ఆస్తి యజమానులు 5% రాయితీ పొందవచ్చు.

తెలంగాణలో ఆస్తి పన్నును ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?

  • తెలంగాణలో ఆస్తి పన్నును ఆన్‌లైన్‌లో చెల్లించడం ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
  • దశ 1: అధికారిక CDMA వెబ్‌సైట్‌ను(https://cdma.cgg.gov.in/cdma_arbs/CDMA_PG/PTMenu) సందర్శించండి
  • దశ 2: మీ PTI నంబర్‌ని నమోదు చేసి, ఆస్తిపన్ను బకాయిగా తెలుసుకోండి బటన్‌పై క్లిక్ చేయండి
  • దశ 3: మీరు క్రిందికి స్క్రోల్ చేసినప్పుడు, మీరు చెల్లించవలసిన మొత్తం వివరాలను చూస్తారు. మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ IDని నమోదు చేసి, చెల్లింపు బటన్‌పై క్లిక్ చేయండి.

మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆస్తి పన్నును చెల్లించవచ్చు అనే విషయం గుర్తుపెట్టుకోండి.

తెలంగాణలో ఆస్తి పన్ను ఆఫ్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?

మీరు తెలంగాణలో ఆస్తి పన్నును ఆఫ్‌లైన్‌లో చెల్లించాలనుకుంటే, మీరు పుర సేవా కేంద్రాన్ని లేదా స్థానిక ULB కేంద్రాన్ని సందర్శించి అక్కడ పన్ను చెల్లించచ్చు.

వాట్సాప్‌లో ఆస్తిపన్ను ఎలా చెల్లించాలి?

మీరు WhatsApp చాట్‌బాట్‌ ద్వారా కూడా ఆస్తి పన్ను చెల్లించవచ్చు. ఈ సేవ ఇంగ్లీష్ మరియు తెలుగులో అందుబాటులో ఉంది.

  • దశ 1: WhatsAppలో +91 90002 53342కి “హాయ్” అని సందేశం పంపండి.
  • దశ 2: మీ ప్రాధాన్య భాష ఎంపికను ఎంచుకోండి.
  • దశ 3: మీ CDMA ఆస్తి పన్నును చెల్లించడానికి మెను ద్వారా వెళ్లి 1ని నమోదు చేయండి.
  • దశ 4: PTIN నంబర్ లేదా మీ ఇంటి నంబర్‌ని ఉపయోగించడం ద్వారా మీ ఆస్తిని గుర్తించండి.
  • ఆస్తి పన్నును క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.

తెలంగాణలో ఆస్తిపన్ను చెల్లించడానికి చివరి రోజు ఏమిటి?

తెలంగాణలో సీఎండీఏ ఆస్తిపన్నును ఏటా వసూలు చేస్తుంది. ప్రతి ఆస్తి యజమాని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30 లోపు తెలంగాణలో ఆస్తిపన్ను చెల్లించాలి. రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ ప్రాపర్టీ యజమానులు గడువు తేదీకి లేదా అంతకు ముందు పన్ను చెల్లించడంలో విఫలమైతే, వారు జరిమానతో చెల్లించాల్సి ఉంటుంది.

(ఇది కూడా చదవండి: Encumbrance Certificate: ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో వాడే పదాల గురించి మీకు తెలుసా?)

తెలంగాణలో, పెనాల్టీ ఛార్జీలు ప్రతి నెలా బకాయి ఉన్న మొత్తంపై 2%. అనధికార నిర్మాణాలకు ఆస్తి యజమానులు జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి పన్నును లెక్కించడానికి మీరు CDMA ఆస్తి పన్ను తెలంగాణ కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు.

ఆస్తి పన్ను సారాంశం:

స్థానిక మునిసిపల్ సంస్థలకు ఆస్తి పన్ను అనేది ఒక ముఖ్యమైన ఆదాయ వనరు. మీరు ఒక ప్రాంతంలో నివసించడానికి ఒక ఇంటిని కలిగి ఉన్నా లేదా అద్దెకు ఇవ్వడానికి ఆస్తిని కలిగి ఉన్నప్పుడు మీ ప్రాంతంలో మునిసిపల్ కి ఆస్తి పన్నును చెల్లించాల్సి ఉంటుంది.

అధికారిక ఆస్తి పన్ను వెబ్‌సైట్ ఏమిటి?

అధికారిక ఆస్తి పన్ను వెబ్‌సైట్ https://cdma.cgg.gov.in/CDMA

ఖాళీగా ఉన్న ప్లాట్‌పై ఆస్తి పన్ను చెల్లించాలా?

ఖాళీగా ఉన్న స్థలంలో మీరు ఇంకా ఎలాంటి నిర్మాణం చేపట్టకపోతే Vacant Land Tax చెల్లించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here