How to Apply Birth Certificate in Telangana: ప్రతి ఒక్కరి జీవితంలో జనన ధృవీకరణ పత్రం అనేది చాలా ముఖ్యమైన విషయం మనకు తెలిసిందే. ఇది ఒక వ్యక్తి సరైన పుట్టిన తేదీ, సమయాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తి ప్రభుత్వం ఉద్యోగం పొందాలి అన్న, పెన్షన్ తీసుకోవాలి అన్న, పాస్ పోర్ట్ పొందాలి అన్న ఇలాంటి ఎన్నో పనులకు జనన ధృవీకరణ పత్రం(Birth Certificate) అనేది చాలా ముఖ్యం.
ఈ జనన ధృవీకరణ పత్రాన్ని మున్సిపల్ అథారిటీ, తహసీల్దార్లు లేదా రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు జారీ చేయవచ్చు. ఏదైనా బిడ్డ పుట్టిన 21 రోజులలోపు దీన్ని నమోదు చేసుకోవాలి. ఇది పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది కాబట్టి తల్లిదండ్రులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
(ఇది కూడా చదవండి: Name Change in Aadhaar Card: ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా?)
ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ పేరు, లింగం, పుట్టిన సమయం, పుట్టిన తేదీ, శాశ్వత చిరునామా మొదలైన అన్ని సమాచారం తప్పని సరిగా కలిగి ఉండాలి. అయితే, ఈ కథనంలో తెలంగాణలో జనన ధృవీకరణ పత్రం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెలంగాణలో జనన ధృవీకరణ పత్రం పొందడానికి అవసరమైన దృవ పత్రాలు:
- హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ షీట్
- తల్లిదండ్రుల వివాహ ధృవీకరణ పత్రం
- తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రం
- ఆసుపత్రిలో పుట్టినట్లు రుజువు
- తల్లిదండ్రుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు
- జనన ధృవీకరణ పత్రం అప్లికేషన్ ఫోరం
తెలంగాణలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
- మొదట జనన ధృవీకరణ పత్రం అప్లికేషన్ ఫోరంను పూర్తి చేయండి.
- ఆ తర్వాత మీ దగ్గరలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి మీ దగ్గర ఉన్నా ఆధారాలను సమర్పించండి.
- మీ సేవలో సమర్పించిన తర్వాత బిడ్డ పుట్టిన ఆసుపత్రికి మీ వివరాలు వెళ్తాయి.
- పై అధికారులు మీ ఆధారాలను పరిశీలించిన తర్వాత మీ అప్లికేషన్‌ను ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తారు.
- ఒకవేల మీరు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్‌ను అధికారులు ఆమోదీస్తే మీ సేవలో ఇచ్చిన మొబైల్ నెంబర్’కు మెసేజ్ వస్తుంది.
SSC మెమోతో DOB Certificate కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
1989 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా DOB Certificate కలిగి ఉండటం ప్రభుత్వ నిబంధనలు తెలుపుతున్నాయి. మరి, ముఖ్యంగా మీరు పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నప్పుడు 1989 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరూ DOB Certificate కలిగి ఉండాల్సి ఉంటుంది. 1989 తర్వాత పుట్టిన వారిలో కొందరు DOB Certificate కలిగి లేరు.
అలాంటి వారు కంగారూ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇలాంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వారు తమ SSC మెమో సహాయంతో తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
- 1) మొదట మీరు SSC మెమోను జిరాక్స్ తీసుకోండి.
- 2) ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫోరంలో మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా వివరాలను నమోదు చేయండి.
- 3) ఇప్పుడు మీరు ఒక బాండ్ పేపర్ మీద పైన పేర్కొన్న వివరాలను నమోదు చేసి సంతకం చేయాల్సి ఉంటుంది.
- 4) ఆ తర్వాత మీ సేవలో దరఖాస్తు చేసుకోండి.
- 5) ఈ ధరఖాస్తు సమయంలో రేషన్/ఆధార్/ఓటర్ ఐడీలో ఏదో ఒకటి సమర్పించాలి.
- 6) ఆ మీ దరఖాస్తు తహశీల్దార్ కార్యాలయనికి వెళ్తుంది.
- 7) అక్కడ ఆర్ఐ, డిప్యూటీ తహశీల్దార్, MRO మీరు సమర్పించన వివరాలను తనిఖీ చేసి ఆమోదించడడం లేదా రిజెక్ట్ చేయడం చేస్తారు.