Land Registration Charges in Dharani Portal: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోలు కోసం 2020లో ధరణి పోర్టల్ లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పోర్టల్‌లో కేవలం అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాకుండా ఇతర అనేక సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
(ఇది కూడా చదవండి: Dharani Portal: తెలంగాణ ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం ఎలా..?)
ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం చాలా సులభంగా, వేగంగా జరుగుతుంది. అలాగే, మనం భూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకున్నప్పుడు అందుకు సంభంధించిన చార్జీల వివరాలను కూడా ప్రభుత్వం పోర్టల్’లో పేర్కొంది. అయితే, ఆ చార్జీలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ధరణిలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంతో తెలుసా?
- ఎవరైనా ధరణి ద్వారా మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక ఎకరం భూమికి రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది.
- అలాగే, కొత్త పట్టాదార్ పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది.
- ధరణి ద్వారా నాలా కోసం(NALA Land Conversion) ధరఖాస్తు చేసుకుంటే భూ విలువలో 2 శాతం, అదే జీహెచ్ఏంసీ పరిధిలో మాత్రం భూ విలువలో 3 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
- ఇక గిఫ్ట్ డీడ్ విషయానికి వస్తే భూ ఛార్జీలు రూ. 1000 నుంచి రూ.10000లుగా ఉన్నాయి.
- ఇక సేల్ డీడ్ విషయానికి వస్తే భూ ఛార్జీలు భూమి విలువలో 6 శాతంగా ఉన్నాయి.
- అదే మార్ట్‌గేజ్ విషయానికి వస్తే భూ ఛార్జీలు భూమి విలువలో గరిష్టంగా 4 శాతంగా ఉన్నాయి.
- మిగతా ఛార్జీలు కోసం ధరణి పోర్టల్ సందర్శించండి.