WhatsApp New Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్దం అవుతుంది. తన యూజర్ల ప్రయోజనాల కోసం ఎన్నో సరికొత్త ఫీచర్స్ తీసుకొచ్చిన సంస్థ, తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొనిరాబోతుంది.
ఇప్పటివరకు వాట్సాప్ వెబ్‌ను వాడుకునేందుకు వినియోగదారులు తమ మొబైల్ సాయంతో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేవారు. ఒకవేళ మీ ఫోన్ కెమెరాలో సమస్య ఉంటే వాట్సాప్ వెబ్‌ను వాడుకునేందుకు అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యకు పరిష్కరించేందుకు వాట్సాప్ త్వరలో ఫోన్ నంబర్ సహాయంతో వాట్సాప్ వెబ్ లాగిన్ అయ్యేలా కొత్త ఫీచర్‌ను తీసుకొని వస్తుంది.
(ఇది కూడా చదవండి: WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇక ఆ కష్టాలకు చెక్!)
దీనికోసం, వాట్సాప్ త్వరలో లింక్ డివైజ్ సెక్షన్‌లో లింక్ విత్ ఫోన్ నంబర్(Link with Phone Number) అనే కొత్త ఆప్షన్ తీసుకొని రాబోతుంది. ఈ లింక్ విత్ ఫోన్ నంబర్‌పై క్లిక్ చేసి ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే డెస్క్‌టాప్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలని సూచిస్తుంది. ఆ తర్వాత మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తున్న 8 అంకెల కోడ్‌ను వాట్సాప్ వెబ్‌లో ఎంటర్ చేసి సులభంగా లాగిన్ కావచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటాఇన్ఫో పేర్కొంది.