Sunday, November 24, 2024
HomeTechnologyMobilesఈ వాట్సప్ స్టేటస్ ట్రిక్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?

ఈ వాట్సప్ స్టేటస్ ట్రిక్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?

వాట్సప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అనేది తీసుకోస్తూ ఉంటుంది. ఈ ఫీచర్స్ వచ్చిన విషయం అనేది కొన్ని సందర్బాలలో యూజర్లకు తెలియక పోవచ్చు. అలాంటి దానికి సంబందించిన వాట్సప్ స్టేటస్ లో వచ్చిన ఫీచర్స్ లేదా ట్రిక్స్ గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రిక్స్ మీ వాట్సప్ లో కూడా పని చేయాలంటే మందు మీ మొబైల్ ని అప్డేట్ చేసుకోండి.

మీరు వాట్సప్ స్టేటస్ లో పెట్టె కొన్ని వీడియోలు లేదా ఫోటోస్ అనేవి మీ మిత్రులకు, బందువులకో నచ్చుతాయి. అప్పుడు వారు వాటిని తమకి షేర్ చేయమని అడుగుతారు. ఇప్పుడు మీరు ఏమి చేస్తారు మీ ఫోన్ గ్యాలరీ లో ఫోటో లేదా వీడియో కోసం వెతుకుతారు…ఇది కొంచెం చిరాకు పనిలాంటిది, అలా కాకుండా మీరు వాటిని చాలా సులభంగా పంపవచ్చు.

ముందుగా వాట్సప్ స్టేటస్ ని ఓపెన్ చేయండి చేశాక. మీ స్టేటస్ పక్కన 3 చుక్కలు కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేస్తే మీకు Forward అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు గత 24 గంటలలో పెట్టిన ఫోటోస్ లేదా వీడియోలు కనిపిస్తాయి అందులో వారు అడిగిన వాటిని పంపవచ్చు. ఈ ట్రిక్ ని ఆండ్రాయిడ్, ios యూజర్లు వాడుకోవచ్చు.(చదవండి: షాకింగ్ న్యూస్.. పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు)

ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమంటే. ఈ స్టేటస్ ని మనం ఎవరో చూడలో, ఎవరు చూడకూడదో నిర్ణయించవచ్చు. అది ఎలా అంటే, ఇంతకు ముందులాగే మీరు వాట్సప్ స్టేటస్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు సర్చ్ సింబల్ పక్కన 3 డా ట్స్ ఉంటాయి.. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు Status Privacy వంటి ఆప్షన్ కనిపిస్తుంది.

దాన్ని క్లిక్ చేస్తే మీకు My Contacts, My Contacts except, Only share with అనే 3 ఫీచర్స్ కన్పిస్తాయి. ఇందులో మీరు My Contact except ని సెలెక్ట్ చేసుకొని ఎవరు మీ స్టేటస్ చూడకూడదో ఎంచుకోండి. ఇక Only share with సెలెక్ట్ చేస్తే మీరు సెలెక్ట్ చేసినవాళ్లు మాత్రమే మీ స్టేటస్ అప్‌డేట్స్‌ని చూసే అవకాశం ఉంటుంది. మిగతావారికి స్టేటస్ కనిపించదు. ఇలా మీ వాట్సప్ స్టేటస్ ఎవరు చూడాలో మీరే డిసైడ్ చేయొచ్చు.

- Advertisement -

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles