ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో 2 లేదా 3 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అయితే, మనం ఎంతో ఇష్టపడి కొనుకున్న మొబైల్ పోతే ఏమి చేయాలో మనకు అర్ధం కాదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లయింట్ ఇచ్చిన దాని వల్ల ప్రయోజనం అతి కొద్ది శాతం మాత్రమే ఉంటుంది, అదే మనం మన ఫోన్ ని కనిపెడితే ఎలా ఉంటుంది. అవును, మనమే మన మొబైల్ ఫోన్ ని గూగుల్ సాయంతో కనిపెట్టవచ్చు. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరి కోసం Google Find My Device అనే అప్లికేషన్ ని ప్లే స్టోర్ లో ఉంచింది. మనం దీనిని ఉపయోగించుకొని మొబైల్, ల్యాప్టాప్, desktop ద్వారా కనుక్కోవచ్చు అదే ఎలానో తెలుసుకుందాం.(చదవండి: పిక్సెల్ 5, 4A 5G మొబైల్ ఫోన్ లను లాంచ్ చేసిన గూగుల్)
- ముందుగా మనం మొబైల్ లో ఒక జీ- మెయిల్ అకౌంట్ అనేది ఉండాలి. దాని ద్వారా మాత్రమే మనం మొబైల్ ఫోన్ ని తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అలాగే మొబైల్ తప్పనిసారిగా gps(ON) లో, mobile data అనేది ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనం మొబైల్ ని కనిపెట్టవచ్చు.
- ఇప్పుడు మనం గూగుల్ సర్చ్ లో Find My Device అని సర్చ్ చేయగానే మీకు ఈ క్రింది image లో చూపించిన allow అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. దాని తర్వాత మీ i సింబల్ లో మీ మొబైల్ యొక్క IMEI నెంబర్ కనిపిస్తుంది. మీ మొబైల్ కనుక డాటా మరియు జీపీఎస్ ఆన్ లో ఉన్నట్లయితే, మీకు మీ మొబైల్ లో వాడే సిమ్ పేరు, బ్యాటరీ శాతాన్ని చూపిస్తుంది.
- బ్యాటరీ శాతం కింద మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి. a) PLAY SOUND b) SECURE DEVICE c) ERASE DEVICE అనే ఆప్షన్ లు మీకు కనిపిస్తాయి.
- మీరు కనుక PLAY SOUND అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే మీ మొబైల్ 5 నిమిషాల వరకు ఒక రింగ్ టోన్ వస్తుంది. దీని ద్వారా మీరు మీ దగ్గరలో ఉన్నట్లయితే మీరు ఆ సౌండ్ ద్వారా ఫోన్ కనిపెట్టవచ్చు.
- మీరు కనుక SECURE DEVICE అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే మీరు అక్కడ మెసేజ్, ఫోన్ నెంబర్(Alternate) ఎంటర్ చేస్తే మీ ఫోన్ లాక్ అవ్వడం తో పాటు. మీ మొబైల్ డిస్ప్లే మీద మీరు ఇచ్చిన మెసేజ్ కనిపిస్తుంది. అలాగే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ అనేది వస్తుంది. దీని ద్వారా కూడా మీరు మీ మొబైల్ ని కనిపెట్టవచ్చు.
- మీరు కనుక SECURE DEVICE అనే ఆప్షన్ ని మీ ఫోన్ లభించని స్థితిలో ఎంచుకోవాలి దీని ద్వారా మన మొబైల్ ఉన్నా డాటా అనేది erase అవుతుంది. దీని మనకు మన డేటా ప్రొటెక్షన్ లభిస్తుంది. ఎవ్వరూ మీ ఫోన్ లో ఉన్నా డేటా ని తెలుసుకోలేరు.(చదవండి: పిక్సెల్ 5, 4A 5G మొబైల్ ఫోన్ లను లాంచ్ చేసిన గూగుల్)
పైన చెప్పిన విదానాన్ని మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది అనేది మన ఫ్రెండ్స్, ఇంట్లోవాళ్లు తప్పిపోయినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అలాగే వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.