Thursday, November 21, 2024
HomeBusinessWhat is a Mortgage Loan: తనఖా రుణం(Mortgage Loan) అంటే ఏమిటి? దాని ఉపయోగాలు

What is a Mortgage Loan: తనఖా రుణం(Mortgage Loan) అంటే ఏమిటి? దాని ఉపయోగాలు

What is Mortgage Loan and Its Benefits in Telugu: మనకు ఏదైనా రుణం అవసరం అయినప్పుడు మార్కెట్లో అనేక రకాల రుణాలు లభిస్తాయి. ఈ రుణాలలో సెక్యూర్డ్ లోన్(Secured Loan) మరియు అన్ సెక్యూర్డ్(Unsecured Loan) లోన్ అనే రెండు వర్గీకరణలు ఉన్నాయి.

అన్‌సెక్యూర్డ్ లోన్ అంటే పర్సనల్ లోన్, ఇన్‌స్టంట్ లోన్ వంటి వంటివి. సంస్థలు ఈ రుణాలు ఇచ్చేటప్పుడు వ్యక్తి ఆదాయం, క్రెడిట్ చరిత్రను పరిగణనలోకి తీసుకొని ఇస్తాయి. అలాగే సెక్యూర్డ్ లోన్(Secured Loan) అంటే మనం ఏదైనా ఆస్తిని తనఖాగా లేదా కుదవ పెట్టి తీసుకునే ఒక ఋణం అని అర్థం.

తనఖా రుణం(Mortgage Loan) అంటే ఏమిటి ?

ఇంతక ముందు మనం చెప్పుకున్నట్లు మార్టిగేజ్ లోన్(Mortgage Loan) అంటే మనం సెక్యూరిటీగా తీసుకునే ఒక రుణం. ఇక్కడ మనం తీసుకునే రుణం విలువ కంటే ఎక్కువ విలువైన ఆస్తిని తనఖా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఆస్తి అంటే అది ఏదైనా కావచ్చు. అది ఇంటి పత్రాలు, భూమి పత్రాలు లేదా వాహనం, విలువైన వస్తువు కావచ్చు.

(ఇది కూడా చదవండి: Overdraft (OD) Facility: ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటి? దాని వలన కలిగే ఉపయోగాలు ఏమిటి?)

రుణాన్ని తిరిగి చెల్లించడానికి రుణగ్రహీత కొన్ని హామీలు బ్యాంకులకు లేదా రుణ సంస్థలకు కొన్ని హామీలు చేయాల్సి ఉంటుంది. తనఖా రుణం ఇచ్చేటప్పుడు సంస్థ, రుణగ్రహీత మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. అయితే ఆస్తులు తనఖా పెట్టి రుణాలు(Loan) తీసుకునే సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

- Advertisement -

మీరు తీసుకున్న మార్టిగేజ్ లోన్ తిరిగి చెల్లించే వరకు రుణగ్రహీత ఆస్తులు ఆ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఆధీనంలో ఉంటాయని గుర్తించుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేకపోతే ఆ ఆస్తిని విక్రయించే అధికారం రుణం ఇచ్చిన సంస్థకు ఉంటుంది.

మార్టిగేజ్ లోన్ ఉపయోగాలు:

  • మీ అవసరాలను తీర్చడానికి కోసం తనఖా రుణం తీసుకున్న ఆ ఆస్తికి మీరు చట్టబద్ధమైన యజమానిగా కొనసాగుతారు.
  • తనఖా రుణాలు సెక్యూర్డ్ రుణాలు కాబట్టి సులభంగా ఆమోదం లభిస్తాయి.
  • వ్యక్తిగత రుణం కంటే తనఖా రుణంపై మీరు చెల్లించే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది.
  • మీరు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ కాలపరిమితిని పొందుతారు. తనఖా రుణంలో 30 సంవత్సరాల వరకు రుణ చెల్లింపు చేసే అవకాశం ఉంది.
  • మీరు డబ్బును ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఎటువంటి పరిమితి లేదు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles