NRIs/ OCIs Aadhaar – PAN linking: ఆధార్- పాన్ లింక్ గడువు ముగిసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు, తాజాగా ఆదాయపు పన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన జారీ చేసింది. ఆధార్- పాన్ లింకింగ్ పాన్ కార్డు దారులు కూడా ఈ జులై 31 వరకు ఇన్కమ్ టాక్స్ చెల్లించవచ్చు అని స్పష్టం చేసింది. అయితే ఇది కేవలం NRI, OCIలకు మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది.
కేవలం, వీరిని మాత్రమే ఆధార్- పాన్ లింకింగ్ నుంచి మినహాయించినట్లు స్పష్టం చేసింది. ఆధార్ కార్డుతో లింకు చేయకపోవడం వల్ల పాన్ కార్డు చెల్లుబాటులో లేని ప్రవాస భారతీయులు(Non-Resident Indian) వీలైనంత తొందరగా పన్ను అధికారుల్ని సంప్రదించాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
(ఇది కూడా చదవండి: పాన్-ఆధార్ లింక్ చేయడం మర్చిపోయారా? ఇలా చేస్తే మళ్ళీ పాన్ యాక్టివేట్)
ఇప్పటికే చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు తమ పాన్ కార్డు పనిచేయడం లేదని ఫిర్యాదులు లేవనెత్తిన నేపథ్యంలోనే ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ఎన్ఆర్ఐలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(OCI) వారి పాన్ కార్డు పనిచేయకపోవడంపై ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది.
అయితే, ఎన్ఆర్ఐ/ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వ్యక్తులు గత 3 సంవత్సరాల్లో ఏ ఒక్క ఏడాది రిటర్న్స్ దాఖలు చేసినా లేదా వారి నివాస స్థితి తెలియజేసినా వారు పాన్ కార్డును మ్యాప్ చేయనున్నట్లు తెలిపింది. తమ నివాస స్థితి తెలియజేయని NRI/OCIల పాన్ కార్డులు మాత్రమే పనిచేయవని ఐటీ శాఖ స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి పరిస్థితి ఎదురైన వారు తమ నివాస స్థితి తెలియజేస్తూ సంబంధిత పన్ను మదింపు అధికారిని (JAO) సంప్రదించాలని వారికి సూచించింది.