Sunday, November 24, 2024
HomeHow ToGruhalakshmi Scheme: గృహలక్ష్మి పథకం కోసం ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

Gruhalakshmi Scheme: గృహలక్ష్మి పథకం కోసం ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

How to Apply for Telangana Gruhalakshmi Scheme 2023: సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారి కోసం తెలంగాణ సర్కారు గృహలక్ష్మి పథకం పేరుతో రూ. 3 లక్షల ఆర్ధిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులను స్వీకరించే క్రమంలో అనేక మంది సందేహాలు లేవనెత్తుతున్నారు.

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ ఫారం నింపాలి, దరఖాస్తును ఎవరికి అందజేయాలి, చివరి తేదీ ఎప్పుడు అనే విషయంలో ప్రజలు చాలా గందరగోళానికి గురి అవుతున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో ప్రక్రియ చేపట్టడంతో ఈ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గృహలక్ష్మి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రచారం జరగటంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల వద్ద క్యూ కట్టారు.

అయితే కొన్ని కలెక్టరేట్ కార్యాలయాలు, మండల కార్యాలయల వద్ద దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వం అధికారికంగా తుది గడువు ప్రకటించకపోయినా తొలిదశలో (ఈ నెల 10వ తేదీ) వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

(ఇది కూడా చదవండి: Gruhalakshmi Scheme 2023: ‘గృహలక్ష్మి పథకం’ పూర్తి వివరాలు.. ఎవరు అర్హులు, మార్గదర్శకాలు?)

ఈ మొత్తం గందరగోళంపై బీఆర్ఎస్ పార్టీ కొద్ది స్పస్టతను ఇచ్చింది. గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి గడువు తేదీ లేదు అని, అది నిరంతర ప్రక్రియ అని పేర్కొంది. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.

ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొంది. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తారు అని తెలిపింది.

- Advertisement -

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు:

  • 2 పాస్ పోర్టు సైజ్ ఫోటోలు
  • రేషన్ కార్డు
  • ఓటర్ ఐడీ కార్డు
  • ఆధార్ కార్డు
  • ఇంటి స్థలం దస్తావేజులు
  • ఇంటి పన్ను రశీదు
  • కరెంట్ బిల్ రశీదు
  • బ్యాంకు ఖాతా బుక్ జిరాక్స్

గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

  • గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ మండల తహశీల్దార్ కార్యాలయంలో లేదా మీ సేవలో లభించే దరఖాస్తు ఫారంను తీసుకోండి.
  • ఆ తర్వాత దరఖాస్తు ఫారంలో మీ దరఖాస్తుదారుడి పేరు, తండ్రి/తల్లి/భర్త పేరు, వయస్సు, మతం, కులం, చిరునామా, ఇంటి వంటి వివరాలు నమోదు చేయండి.
  • ఇప్పుడు మీ మండల తహశీల్దార్ కార్యాలయం/MPDO, Collector ఆఫీసులో దరఖాస్తు ఫారంతో పాటు పైన పేర్కొన్న పత్రాలు సమర్పించండి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles