Sunday, October 13, 2024
HomeGovernmentGruhalakshmi Scheme 2023: 'గృహలక్ష్మి పథకం' దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఇదే! ఎలా, ఎక్కడ...

Gruhalakshmi Scheme 2023: ‘గృహలక్ష్మి పథకం’ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఇదే! ఎలా, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

How To Apply Gruhalakshmi Scheme in Telangana: రాష్ట్రంలో సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గృహలక్ష్మి పథకం అమలులో భాగంగా పలు జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు తెలుస్తుంది.

మహా-బాద్, ములుగు, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల నుంచి ఆ మేరకు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ జిల్లాలో గృహలక్ష్మి పథకం లబ్ధి కోసం అవసరమైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 10 తారీఖులోగా మండల కార్యాలయాల్లో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక గృహలక్ష్మి కౌంటర్లలో ఫారం నింపి సమర్పించాలని తెలుస్తుంది.

(ఇది కూడా చదవండి: మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం.. అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?)

ఆగస్టు 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తుల జాబితా రూపొందించి జిల్లాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆహార భద్రత కార్డు ఉన్నవారికి, సొంత ఇండ్లు లేని వారికి, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 59 కింద లబ్ది పొందని వారిని అర్హులుగా ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 20వ తేదీ వరకు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి, ఆగస్టు 25 నాటికి జిల్లాకు కేటాయించిన గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు:

  • ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఖాళీ జాగా ఉండాలి.
  • లబ్ధిదారుడుకి రేషన్ కార్డు ఉండాలి.
  • లబ్ధిదారుడు అదే ప్రాంతానికి చెందిన వారై ఉండాలి.
  • ఆధార్‌/ఓటర్‌ ఐడీకార్డులు ఉండాలి. బ్యాంకులో ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలి.
  • ఇప్పటికే RCC Roofతో కూడిన ఇల్లు ఉన్నా, GO 59 కింద లబ్ధి పొందినా ఈ పథకం వర్తించదు.

గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు:

  • 100 శాతం రాయితీతో ఈ ఆర్థిక సాయం అందించనుంది.
  • రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
  • రాష్ట్ర రిజర్వు కోటాలో 43 వేల మందికి, మొత్తంగా 4 లక్షల మందికి ఈ పథకం కింద ఆర్థిక సాయం అందనుంది.
  • మహిళల పేరు మీదే ఆర్థిక సాయం చేయనున్నారు కాబట్టి ఆ మహిళ పేరిట ఒక బ్యాంకు ఖాతా ఉండాలి.
  • జన్‌ధన్‌ ఖాతాను వినియోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
  • రెండు గదులతో RCC ఇంటి నిర్మాణం కోసం ఆర్థికసాయం అందించనున్నారు.
  • ఇంటి బేస్‌ మెంట్‌ లెవెల్‌, రూఫ్‌ లెవెల్‌, స్లాబ్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం సాయం అందిస్తుంది.
  • కలెక్టర్లు, కమిషనర్లు నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారు.
  • ప్రతి నియోజకవర్గంలో SCలకు 20 శాతం, STలకు 10 శాతం, BC, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను సెలెక్ట్ చేయాలని మార్గనిర్దేశాల్లో ప్రభుత్వం తెలిపింది. దివ్వాంగులకు కూడా 5 శాతం రిజర్వేషన్లను ప్రకటించింది ప్రభుత్వం.

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు:

  • 2 పాస్ పోర్టు సైజ్ ఫోటోలు
  • రేషన్ కార్డు
  • ఓటర్ ఐడీ కార్డు
  • ఆధార్ కార్డు
  • ఇంటి స్థలం దస్తావేజులు
  • ఇంటి పన్ను రశీదు
  • కరెంట్ బిల్ రశీదు
  • బ్యాంకు ఖాతా బుక్ జిరాక్స్

గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

  • గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ మండల తహశీల్దార్ కార్యాలయంలో/మీ సేవలో లభించే దరఖాస్తు ఫారంను తీసుకోండి.
  • ఆ తర్వాత దరఖాస్తు ఫారంలో మీ దరఖాస్తుదారుడి పేరు, తండ్రి/తల్లి/భర్త పేరు, వయస్సు, మతం, కులం, చిరునామా, ఇంటి వివరాలు నమోదు చేయండి.
  • ఇప్పుడు మీ మండల తహశీల్దార్ కార్యాలయం/MPDO ఆఫీసులో దరఖాస్తు ఫారంతో పాటు పైన పేర్కొన్న పత్రాలు సమర్పించండి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles