Thursday, November 21, 2024
HomeReal EstatePay Property Tax: తెలంగాణలో ఆస్తిపన్ను సులభంగా ఆన్​లైన్​లో చెల్లించండిలా..!

Pay Property Tax: తెలంగాణలో ఆస్తిపన్ను సులభంగా ఆన్​లైన్​లో చెల్లించండిలా..!

How To Pay Property Tax in Online Telugu: ప్రజలు తమ ఆధీనంలో ఉన్న భూమి. ఇల్లు మీద స్థానిక సంస్థలు లేదా ప్రభుత్వానికి వార్షికంగా చెల్లించే పన్నునే ప్రాపర్టీ ట్యాక్స్​ అని అంటారు. మీ ఇంటి విలువను మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ వంటి స్థానిక సంస్థలు మదింపు చేసి దాని ఆధారంగా మీరు ఏడాదికి ఎంత పన్ను చెల్లించాలో నిర్దేశిస్తాయి.

గ్రేటర్ హైదరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లోనూ పైన పేర్కొన్న విధంగానే ఆస్తి పన్నును మదింపు చేసి బల్దియా అధికారులు ఆ పన్నును వసూలు చేస్తారు. స్థానిక సంస్థలు, మీ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ పన్నును ప్రతి ఏడాది వసూలు చేస్తాయి.

(ఇది కూడా చదవండి: House Buying Tips: ఇల్లు కొనే ముందు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?)

అయితే ఇప్పుడు మీరు గనుక GHMC పరధిలో ఉండి ప్రాపర్టీ ట్యాక్స్(Property Tax)​ చెల్లించడం కోసం నగరంలో ఎక్కడో ఉన్న కార్యాలయానికి వెళ్తున్నారా?.. ఇక మీరు పన్ను చెల్లించడం ఎక్కడికో వెళ్ళకుండా.. ఉన్న చోటు నుంచే సులభంగా ఆన్​లైన్​లో చెల్లించవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

GHMC ఆస్తిపన్ను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి..?

  • మీరు ఆన్​లైన్​లో ఆస్తి పన్ను చెల్లించడానికి https://ghmc.gov.in/ని ఓపెన్​ చేయాలి
  • అనంతరం ‘Online Payments’ అనే ట్యాబ్‌ని ఎంచుకుని ‘Property Tax’ అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ PTIN(ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య), రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్​ను నమోదు చేసి OTP మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు చెల్లించాల్సిన బకాయిలు, వాటిపై వడ్డీ, సర్దుబాట్లు, ఆస్తి పన్ను ఇలా ప్రాపర్టీ ట్యాక్స్​కు సంబంధించిన వివరాలన్నీ మీకు కనిపిస్తాయి.
  • ఆ తర్వాత, మీరు పన్నును ఏ విధంగా చెల్లిస్తారో అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ను కట్టవచ్చు.
  • మీ చెల్లింపు సక్సెస్ అయ్యాక మీకు ఒక రశీదు వస్తుంది.
  • ఇలా సులభంగా ఆన్​లైన్​లో GHMCలో మీ ఆస్తి పన్నును చెల్లించవచ్చు.

మునిసిపల్ కార్పొరేషన్‌కు(CDMA) ఆన్‌లైన్‌లో ఎలా ఆస్తి పన్ను చెల్లించాలి..?

  • మీరు ఆన్​లైన్​లో ఆస్తి పన్ను చెల్లించడానికిhttps://emunicipal.telangana.gov.in/ని ఓపెన్​ చేయాలి
  • అనంతరం ‘Online Payments’ అనే ట్యాబ్‌ని ఎంచుకుని ‘Property Tax (House Tax)’ అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ PTIN (ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య) నంబర్​ను నమోదు చేసి Know Property Tax Dues మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు చెల్లించాల్సిన బకాయిలు, వాటిపై వడ్డీ, సర్దుబాట్లు, ఆస్తి పన్ను ఇలా ప్రాపర్టీ ట్యాక్స్​కు సంబంధించిన వివరాలన్నీ మీకు కనిపిస్తాయి.
  • ఆ తర్వాత, మీరు పన్నును ఏ విధంగా చెల్లిస్తారో అనే ఆప్షన్​ను ఎంచుకొని పన్ను చెల్లించాలి.
  • మీ చెల్లింపు సక్సెస్ అయ్యాక మీకు ఒక రశీదు, నెంబర్ వస్తుంది.
  • ఇలా సులభంగా ఆన్​లైన్​లో CDMAలో మీ ఆస్తి పన్నును చెల్లించవచ్చు.

(ఇది కూడా చదవండి: ఓపెన్ ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles