How To Find My PPO Number: ప్రతి ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత వారికి ప్రభుత్వం కల్పించిన ఆదాయ మార్గమే పెన్షన్. అయితే, క్రమం తప్పకుండా రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ పొందాలంటే.. సదరు బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ‘జీవన ప్రమాణ పత్రం(Annual Life Certificate)’ను సమర్పించాల్సి ఉంటుంది.
(ఇది కూడా చదవండి: EPF Account: రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అవుతుందా?)
ప్రతి ఏడాది ఈ సర్టిఫికేట్ సమర్పిస్తేనే ఉద్యోగులు పెన్షన్ డబ్బులను పొందగలుగుతారు. అయితే, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ పొందాలంటే.. కచ్చితంగా PPO నంబర్ తెలియాల్సి ఉంటుంది. మరి, ఈ పీపీఓ నంబర్‌ను ఆన్లైన్లో తెలుసుకోవడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
ఆన్లైన్లో పీపీఓ నంబర్‌ను తెలుసుకోండి ఇలా..?
- ముందుగా www.epfindia.gov.in పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత Online Serviceలోని pensioner’s portalపై క్లిక్ చేయాలి.
- అనంతరం పేజీ కుడి భాగంలో ఉండే ‘Know Your PPO number’పై క్లిక్ చేయాలి.
- మీ బ్యాంక్ ఖాతా నంబర్ లేదా PF సంఖ్యను ఎంటర్ చేయాలి.
- ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మీకు PPO నంబర్‌తో పాటు Member ID, ఏ రకమైన పెన్షన్‌ను మీరు పొందుతున్నారు లాంటి వివరాలు మీకు కనిపిస్తాయి.
- ఈ యూనిక్ నంబర్ అనేది పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో గానీ, యానువల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించేటప్పుడు గానీ ఉపయోగపడుతుంది.
- మీ PF ఖాతాను ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి మరొక బ్యాంక్‌కు బదిలీ చేసేటప్పుడు కూడా ఈ PPO నంబర్ చాలా ఉపయోగపడుతుంది.
Digilocker నుంచి కూడా PPO నంబర్ డౌన్లోడ్!
- EPF పోర్టల్ నుంచే కాకుండా Digilocker ద్వారా కూడా పెన్షన్ పేమెంట్ ఆర్డర్(PPO)ను సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఇందుకోసం..ముందుగా digilocker.gov.inలో రిజిస్టర్ కావాలి.
- ఆ తర్వాత Digilocker అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- ఇప్పుడు UAN సేవలపై క్లిక్ చేసి నంబర్‌ను నమోదు చేయాలి.
- అనంతరం ‘Get Document’పై క్లిక్ చేసి ‘e-PPO’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.