Friday, May 3, 2024
HomeHow ToPPO Number: ఆన్​లైన్​లో పీపీఓ నంబర్​ను తెలుసుకోండి ఇలా..?

PPO Number: ఆన్​లైన్​లో పీపీఓ నంబర్​ను తెలుసుకోండి ఇలా..?

How To Find My PPO Number: ప్రతి ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత వారికి ప్రభుత్వం కల్పించిన ఆదాయ మార్గమే పెన్షన్​. అయితే, క్రమం తప్పకుండా రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్​ పొందాలంటే.. సదరు బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ‘జీవన​ ప్రమాణ పత్రం(Annual Life Certificate)’ను సమర్పించాల్సి ఉంటుంది.

(ఇది కూడా చదవండి: EPF Account: రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్‌ ఖాతాలో వడ్డీ జమ అవుతుందా?)

ప్రతి ఏడాది ఈ సర్టిఫికేట్ సమర్పిస్తేనే ఉద్యోగులు పెన్షన్​ డబ్బులను పొందగలుగుతారు. అయితే, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి యాన్యువల్​ లైఫ్ సర్టిఫికేట్ పొందాలంటే.. కచ్చితంగా PPO నంబర్​ తెలియాల్సి ఉంటుంది. మరి, ఈ పీపీఓ నంబర్​ను ఆన్​లైన్​లో తెలుసుకోవడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

ఆన్​లైన్​లో పీపీఓ నంబర్​ను తెలుసుకోండి ఇలా..?

  • ముందుగా www.epfindia.gov.in పోర్టల్​లోకి లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత Online Serviceలోని pensioner’s portalపై క్లిక్​ చేయాలి.
  • అనంతరం పేజీ కుడి భాగంలో ఉండే ‘Know Your PPO number’పై క్లిక్​ చేయాలి.
  • మీ బ్యాంక్​ ఖాతా నంబర్​ లేదా PF సంఖ్యను ఎంటర్​ చేయాలి.
  • ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మీకు PPO నంబర్​తో పాటు Member ID, ఏ రకమైన పెన్షన్​ను మీరు పొందుతున్నారు లాంటి వివరాలు మీకు కనిపిస్తాయి.
  • ఈ యూనిక్​ నంబర్​ అనేది పెన్షన్​కు దరఖాస్తు చేసుకునే సమయంలో గానీ, యానువల్​ లైఫ్​ సర్టిఫికేట్​ను సమర్పించేటప్పుడు గానీ ఉపయోగపడుతుంది.
  • మీ PF ఖాతాను ఒక బ్యాంక్​ బ్రాంచ్​ నుంచి మరొక బ్యాంక్​కు బదిలీ చేసేటప్పుడు కూడా ఈ PPO నంబర్ చాలా ఉపయోగపడుతుంది.

Digilocker నుంచి కూడా PPO నంబర్​ డౌన్​లోడ్​!

  • EPF పోర్టల్​ నుంచే కాకుండా Digilocker ద్వారా కూడా పెన్షన్​ పేమెంట్​ ఆర్డర్(PPO)​ను సులువుగా డౌన్​లోడ్ చేసుకోవచ్చు.
  • ఇందుకోసం..ముందుగా digilocker.gov.inలో రిజిస్టర్​ కావాలి.
  • ఆ తర్వాత Digilocker అకౌంట్​లోకి లాగిన్​ అవ్వాలి.
  • ఇప్పుడు UAN సేవలపై క్లిక్​ చేసి నంబర్​ను నమోదు​ చేయాలి.
  • అనంతరం ‘Get Document’పై క్లిక్​ చేసి ‘e-PPO’ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles