Sunday, November 24, 2024
HomeHow ToWhatsApp Channels: వాట్సాప్‌లో ఛానెల్స్‌ ఎలా క్రియేట్ చేయాలి..?

WhatsApp Channels: వాట్సాప్‌లో ఛానెల్స్‌ ఎలా క్రియేట్ చేయాలి..?

How To Create WhatsApp Channels: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌(Whatsapp Channels) ఛానెల్స్‌ పేరుతో సరికొత్తగా మరో ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో ఈ ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు మెటా ప్రకటించింది.

ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది. ఒకవేళ మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాకపోయి ఉంటే వెంటనే మీ వాట్సాప్ యాప్ లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ అవ్వండి.

వాట్సాప్‌ ఛానెల్స్‌(What is Whatsapp Channel) అంటే ఏమిటి?

ఇప్పటి వరకు మనం వాట్సాప్‌ను పరస్పర కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే వాడేవాళ్లం. ఆ తర్వాత సంస్థ ఇప్పటి వరకు అనేక కొత్త ఫీచర్స్ తీసుకొని వచ్చింది. తాజాగా ఛానెల్స్‌ పేరుతో మరో కొత్త ఫీచర్స్ తీసుకొని వచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో మీకు నచ్చిన సెలిబ్రిటీలు, వ్యక్తులు, సంస్థలను, ప్రభుత్వాలను ఫాలో అయ్యి వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు వాటి అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు.

(ఇది కూడా చదవండి: Smart TV Buying Guide Tips: స్మార్ట్‌టీవీ కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే!)

ఈ ఫీచర్ అచ్చం ట్విటర్‌, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో అలా అన్నమాట. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. ఈ ఫీచర్లో ఉన్నా మరో గొప్ప విషయం ఏమిటంటే మీరు చానెల్ ఫాలో అయినంత మాత్రానా మీ ఫోన్‌ నంబర్‌ ఎవరికీ కనిపించదు.

- Advertisement -

వాట్సాప్‌ ఛానెల్స్‌ ఎలా ఫాలో అవ్వాలి..?

  • వాట్సాప్‌లో మీకు ఛానెల్స్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చి ఉంటే స్టేటస్‌(Status) ట్యాబ్‌ స్థానంలో అప్‌డేట్స్‌(Updates) పేరుతో మరో కొత్త ఫీచర్ కనిపిస్తుంది.
  • అక్కడ పై భాగంలో స్టేటస్‌లు కనిపిస్తాయి.. దాని దిగువన ఛానెల్స్‌ కనిపిస్తాయి.
  • దిగువన మీకు ఫైండ్‌ ఛానెల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • ఇప్పటికే కత్రినా కైఫ్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలు మీడియా సంస్థల ఛానెళ్ల పేర్లు మీకు కనిపిస్తాయి.
  • పక్కనే ఉన్న ప్లస్‌ (+) సింబల్‌ క్లిక్‌ చేయడం ద్వారా ఛానెల్‌ను ఫాలో అవ్వొచ్చు.

వాట్సాప్‌లో ఛానెల్స్‌ ఎలా క్రియేట్ చేయాలి..?

ఛానెల్స్‌ ఆప్షన్‌ ద్వారా వ్యక్తులు సైతం తమ పేరుతో సొంత ఛానెల్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఛానెల్స్‌ పక్కనే ఉన్న ప్లస్‌ సింబల్‌ మీద క్లిక్‌ చేస్తే క్రియేట్‌ ఛానెల్‌ అనే ఆప్షన్‌ మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత డీపీ, ఛానెల్‌ పేరు, ఛానెల్‌ డిస్క్రిప్షన్‌ పేర్కొని సింపుల్‌గా ఛానెల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వారికి ఆ లింక్‌ను షేర్‌ చేయొచ్చు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles