What is Sadabainama in Telugu: రెండూ తెలుగు రాష్ట్రాలలో భూములకు సంబందించి అనే పదాలు వాడుకలలో ఉన్నాయి. అయితే, భూములకు సంబందించిన పదాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందులో సాదాబైనామా(Sadabainama) అనేది చాలా ముఖ్యమైన పదం. అయితే, ఈ పదానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఎందుకో మనం తెలుసుకుందాం.
సాదాబైనామా(Sadabainama) అంటే ఏమిటి?
సాదాబైనామా అంటే తెల్ల కాగితంపై భూమి కొనుగోలు లేదా రిజిస్టర్ కాని క్రయ విక్రయాలను సాదాబైనామా అంటారు. రిజిస్ట్రేషన్ కానీ ఏ భూ లావాదేవీ కూడా కేవలం తెల్ల కాగితాల ద్వారా భూమి కొనుగోలు జరిగితే అది సాదాబైనామా(Sadabainama) కొనుగోలే అవుతుంది.
(ఇది కూడా చదవండి: డైగ్లాట్/ సేత్వార్ పహణీ, ఖాస్రా పహణీ, ఆర్‌ఓఆర్- 1బి అంటే ఏమిటి?)
రిజిస్ట్రేషన్ కాని కొనుగోలుపై ఏదైనా పట్టా పొందాలంటే వాటిని రెగ్యులరైజేషన్ చేయించుకోవడం, లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చేస్తేనే పట్టా వస్తుంది. బాండు పేపర్ మీద లేదా స్టాంపు పేపర్ మీద భూమి కొనుగోలు చేసిన లేదా వాటిని నోటరీ చేయించుకున్నా సరే అన్ రిజిస్టర్డ్(రిజిస్ట్రేషన్ కాని) కొనుగోలు కిందికే వస్తుంది.
సాదాబైనామా: సులభంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే భూ క్రయవిక్రయాల కోసం తెల్లకాగితంపై రాసుకునే ఒక ఒప్పంద పత్రమే సాదాబైనామా. ఇంకా, సెటిల్ డీడ్ మరియు సేత్వార్ అనే పదాలు చాలా ముఖ్యమైనవి.
సెటిల్ మెంట్ డీడ్(Settlement Deed) అంటే ఏమిటి?
సెటిల్ మెంట్ డీడ్ అనేది ఒక వివాద పరిష్కారానికి సంబంధిత పక్షాల మధ్య అధికారికంగా చట్టపరంగా ఆమోదయోగ్యమైన పత్రం. ఏదైనా సమస్య కోర్టులో తేల్చుకోవడానికి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది.
కాబట్టి, సెటిల్ మెంట్ డీడ్ అనేది ఒక మంచి ప్రత్యామ్నాయం, ఎందుకంటే ఇది చట్టబద్ధంగా కట్టుబడి ఉండే.. సంబంధిత పక్షాలచే అంగీకరించే నిబంధనలను కలిగి ఉంటుంది. ఒక న్యాయపరమైన విషయాన్ని పరిష్కరించుకోవడానికి తక్కువ సమయం, ఖర్చుతో కోరుకుంటే ఇది ఒక మంచి మార్గం.
సేత్వార్ పహాణి(Sethwar Pahani) అంటే ఏమిటి?
ఏపీలో 1910-1920 ప్రాంతంలో జమిందారీలను రద్దు చేసిన ప్రాంతాలలో సర్వే సెటిల్‌మెంట్ జరిపి సెటిల్‌మెంట్ శాఖ రూపొందించినదే సెటిల్‌మెంట్ ఫెయిర్ అడంగల్/రిసెటిల్‌మెంట్ రిజిష్టర్. బ్రిటీష్ ప్రభుత్వం రైత్వారీ విధానాన్ని అమలు పరిచిన గ్రామాలలో వారు రూపొందించిన రిజిష్టర్‌ను డైగ్లాట్ లేదా సెటిల్‌మెంట్ రిజిష్టరు అని, అంటారు.
(ఇది కూడా చదవండి: Property Documents: ఆస్తి పత్రాలు పోగొట్టుకుంటే.. డూప్లికేట్ పత్రాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?)
ఇవి రెండూ ఒకే విధమైన ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో 1934 ప్రాంతంలో నైజాం సర్కారు భూముల బందోబస్తు(ల్యాండ్ సెటిల్‌మెంట్) చేసింది. ఒక పద్ధతి ప్రకారం భూములకు సర్వే నంబర్లు, మ్యాపులతో సహా రికార్డులను రూపొందించింది. దీనినే తెలంగాణలో సేత్వార్ పహాణీ అని అంటారు.
రెండూ తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్క గ్రామానికి సర్వే సెటిల్‌మెంట్ పూర్తిచేసి వీటిని తయారుచేశారు. అన్ని గ్రామ లెక్కలకు రిసెటిల్‌మెంట్ రిజిష్టర్/ సేత్వార్ పహాణీ/ సెటిల్‌మెంట్ ఫెయిర్ అడంగల్ మూలస్తంభం వంటిది.