Property Documents: మన దేశంలో ఆస్తికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఆస్తికి సంబంధించిన దస్తావేజులు అనేవి చట్టపరమైన హక్కును తెలియజేస్తాయి. ఇలాంటి ముఖ్యమైన పత్రాలను ఒకవేళ పోగొట్టుకుంటే మనం కంగారూ పడాల్సిన అవసరం లేదు.
(ఇది కూడా చదవండి: ప్రాపర్టీ టాక్స్ అంటే ఏమిటి? ఆస్తి పన్నును ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?)
మీ ఆస్తికి సంబంధించిన బరిజినల్ డాక్యుమెంట్లు పోగొట్టుకుంటే డూప్లికేట్ కాఫీ పొందొచ్చు అని మీకు తెలుసా. రిజిస్టర్డ్ ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయం తమ రికార్డుల్లో భద్రపరుస్తుంది. అక్కడి నుంచి డూప్లికేట్ కాపీని పొందడానికి కొంత ప్రొసీజర్ అనుసరించాల్సి ఉంటుంది. అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎఫ్‌ఐఆర్ నమోదు
ఆస్తికి సంబంధించిన పత్రాలు పోయినా, ఎవరైనా చోరీ చేసినా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ఫైల్ చేయాలి. ఒకవేళ పత్రాలను కనుగొనడంలో పోలీసులు విఫలం అయితే నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్(ఎన్‌టీస్రీ)ను జారీ చేస్తారు. డూప్లికేట్ ఆస్తి పత్రాలను పొందేందుకు కావాల్సిన పత్రం ‘ఎన్‌టీసీ’.
పత్రికా నోటీసు
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత,. ఆస్తి వివరాలతో సహా దీనికి సంబంధించిన నోటీసును కనీసం రెండు వార్తా పత్రికల్లో వచ్చేట్లు చూసుకోవాలి. ఒక ప్రకటన ఆంగ్లంలో, మరొకటి స్థానిక భాషలో
ఉండాలి. ఒకవేళ పోయిన పత్రాలు వేరొకరికి దొరికీ ఉంటే వారు ఆస్తి యజమానికి తిరిగి ఇచ్చే అవకాశముంది. అందుకు అని పత్రికా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
షేర్ సర్టిఫికేట్
ఏదైనా హౌసింగ్ సొసైటీలో ఆస్తి ఉంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) నుంచి డూప్లికేట్ షేర్ సరిఫికెట్‌ను పొందొచ్చు. RWA నుంచిఈ సర్టిఫికెట్ పొందేందుకు ఎఫ్‌ఐఆర్, పత్రికా నోటీసు తప్పనిసరి.
షేర్ సర్టిఫికెట్ ఆ వ్యక్తికి సొసైటీలో ఉన్న ఆస్తీ షేర్‌ను తెలియజేస్తుంది.
నోటరీ
డూప్లికేట్ సర్జిఫికెట్ కాఫీ కోసం దరఖాస్తు చేసుకునే ముందు… రూ.10 నాన్ జడీషియల్ స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ నోటరీ చేయించాలి. ఇందులో ఎఫ్‌ఐఆర్ నెంబర్, పోయిన ఆస్తీ పత్రాల వివరాలు, వార్తాపత్రికలలో ప్రచురించిన నోటీసు, లాయర్ సర్టిఫికెట్ వివరాలు నమోదు చేయదంతో పాటు దరఖాస్తు చేయడానికి గల కారణాన్ని పేర్కొనాలి.
డూప్లికేట్ పత్రాలు
15 రోజుల నోటీసు వ్యవధి తర్వాత, సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించి… పోగొట్టుకున్న పత్రాల వివరాలు, ఎఫ్‌ఐఆర్ కాపీ, నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్, నోటరీలను సమర్పించి డూప్లికేట్ కాపీ
కోసం దరఖాస్తు చేసుకోవాలి. తదుపరి 7-10 పని దినాల్లో సబ్-రిజిస్రార్ ఆఫీసు నుంచి డూప్లికేట్ సేల్ డీడ్/టైటిల్ డీడ్ కాపీని పొందొచ్చు. డూప్లికేట్ ఆస్తి పత్రాలు సబ్‌రిజిస్ట్రార్ ఆమోదంతో పాటు స్టాంపింగ్ పొందుతారు కాబట్టి ఇవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి.