Friday, November 22, 2024
HomeAutomobileEV NewsOla S1 Pro vs Ather 450X: ఓలా ఎస్ 1 ప్రో Vs ఏథర్...

Ola S1 Pro vs Ather 450X: ఓలా ఎస్ 1 ప్రో Vs ఏథర్ 450 ఎక్స్.. ఈ రెండు స్కూటర్లలో ఏది కొనడం మంచిది!

Ola S1 Pro vs Ather 450X: ప్రస్తుత ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ కంపెనీలు అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో. దాని ప్రధాన ప్రత్యర్థి ఏథర్ 450 ఎక్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొనడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓలా ఎలక్ట్రిక్ S1ప్రొ Vs ఏథర్ 450ఎక్స్: డిజైన్

డిజైన్ పరంగా, ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు వెంటనే ఆకట్టుకునే డిజైన్’తో వస్తాయి. ఓలా ఎస్ 1 ప్రో వృత్తాకార హెడ్ ల్యాంప్ డిజైన్’ను కలిగి ఉంది. ఇది కొంత ఫ్యామిలీ లుక్ ఇస్తుంది. ఏథర్ 450 ఎక్స్ కూడా అలాగే ఉంటుంది. దీని డైనమిక్ డిజైన్ కారణంగా ఓలా కంటే మరింత స్పోర్టివ్’గా కనిపిస్తుంది.

బ్యాటరీ ప్యాక్(Battery Pack)

ఓలా ఎస్ 1 ప్రోలో 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిలో ఉన్న ఎకో, నార్మల్ మోడ్ ఫీచర్స్ కారణంగా వరుసగా 195 కిలోమీటర్లు, 143 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందించగలదు. Ather 450Xలో 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు (సర్టిఫైడ్) వరకు ప్రయాణిస్తుంది.

ఫీచర్స్(Features)

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో అడ్వాన్స్డ్ ఫీచర్లు లోడ్ చేసి ఉన్నాయి. రెండింటిలో కూడా Touch Screen Instrument Cluster ఉంది. వీటిలో మొబైల్ అప్లికేషన్’తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఏథర్ 450 ఎక్స్ ఏథర్ స్టాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తే… ఓలా ఎస్ 1 ప్రొ మూవ్ ఓఎస్’ను ఉపయోగిస్తోంది. అదనంగా, ఏథర్ 450 ఎక్స్ లో జాయ్ స్టిక్ కూడా లభిస్తుంది.

- Advertisement -

పెర్ఫార్మెన్స్(Performance)

ఓలా ఎస్ 1 ప్రో (Ola S1 Pro) గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. ఈ స్కూటర్ 2.6 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక ఏథర్ 450 ఎక్స్(Ather 450X) గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు మాత్రమే. ఇది 3.3 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ధర(Price)

ఓలా ఎస్ 1 ప్రో(Ola S1 Pro Price) ధర రూ .1.29 లక్షలు అయితే, 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ గల ఏథర్ 450 ఎక్స్(Ather 450X Price) ఈవీ ధర రూ .1.45 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

(ఇది కూడా చదవండి: రూ.లక్ష కన్నా తక్కువకే లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles