Monday, November 4, 2024
HomeBusinessCIBIL Score: క్రెడిట్‌ స్కోరు అంటే ఏమిటి? ఫ్రీగా ఎలా చెక్‌ చేసుకోవాలి?

CIBIL Score: క్రెడిట్‌ స్కోరు అంటే ఏమిటి? ఫ్రీగా ఎలా చెక్‌ చేసుకోవాలి?

Waht is CIBIL/Credit Score: ప్రస్తుతం మనం ఎలాంటి రుణం, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్న సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. ఈ క్రెడిట్ స్కోర్ బాగుంటనే మనకు వచ్చే రుణం ఎక్కువ మొత్తంలో వస్తుంది. అస్సలు సిబిల్/ క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి.. దానిని ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సిబిల్/ క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్/ క్రెడిట్ స్కోర్ అనేది మీ క్రెడిట్‌ చరిత్రను నిర్ణయించే ఒక మూడంకెల సంఖ్య. CIBIL అంటే.. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(ఇండియా) లిమిటెడ్‌ అని అర్ధం. ఇది ఆర్‌బీఐ నుంచి ఆమోదం పొందిన ఒక క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ. ఇది ఒక వ్యక్తి, కంపెనీ లేదా పబ్లిక్‌/ప్రైవేట్‌ సంస్థల క్రెడిట్‌ చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ స్కోరు అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది.

క్రెడిట్ రిపోర్ట్‌ అనేది మీ సిబిల్‌ స్కోరుతో పాటు క్రెడిట్‌కు సంబంధించిన మీ అన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కలిగి ఉండే నివేదిక. ఈ నివేదికలో మీ రుణాల చరిత్రతో పాటు ఎన్ని మీరు రుణాలు తీసుకున్నారు, వాటికి సంబంధించిన బకాయిలు, ఏ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు అనే వివరాలు ఇక్కడ ఉంటాయి.

(ఇది కూడా చదవండి: Credit Score: మీ క్రెడిట్ స్కోర్ సులభంగా పెంచుకోండి ఇలా..?)

ఈ స్కోరు 750 అంతకంటే మెరుగ్గా ఉంటే వ్యక్తిగత రుణాలు, ఇంటి రుణం, క్రెడిట్‌ కార్డుల ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిబిల్‌ సంస్థ.. దేశంలోని ప్రధాన బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీలు), హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో సంబంధం కలిగి ఉంది.

- Advertisement -

ప్రస్తుతం మన దేశంలో ఉన్న నాలుగు ప్రధాన క్రెడిట్‌ బ్యూరోలలో సిబిల్‌ ఒకటి. సిబిల్ కాకుండా ఎక్స్‌పీరియన్‌, ఈక్విఫాక్స్‌, సీఆర్‌ఐఎఫ్‌ హైమార్క్‌.. ప్రధాన క్రెడిట్ రిపోర్ట్ జారీ చేసే బ్యూరోలుగా ఉన్నాయి. ఆర్‌బీఐ ఈ క్రెడిట్‌ ఏజెన్సీ లన్నిటికీ లైసెన్సులను మంజూరు చేసింది.

దేశంలోని ప్రధాన క్రెడిట్ బ్యూరోలు:

CIBIL: భారత్‌లో అత్యంత ప్రసిద్ధ క్రెడిట్‌ ఏజెన్సీగా ‘సిబిల్‌’ పేరు సాధించింది. దీన్ని 2000లో స్థాపించారు. 60 కోట్లకు పైగా భారతీయులు, 3.2 కోట్ల కార్పొరేట్‌ సంస్థల క్రెడిట్‌ రిపోర్ట్‌లను ఈ సంస్థ నిర్వహిస్తోంది.
Experian: ఇది కూడా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ)తో గుర్తింపు పొందింది. దీనిని 2006లో స్థాపించారు. 2010 నుంచి భారత్‌లో పనిచేయడం ప్రారంభించింది.
CRIF High Mark: దీనిని 2007లో స్థాపించారు. 2010లో దీనికి లైసెన్స్‌ వచ్చింది. ఇది అందించే స్కోర్‌ పరిధి 300 నుంచి 850 వరకు ఉంటుంది.
Equifax: ప్రపంచంలోని 3 అతిపెద్ద క్రెడిట్‌ బ్యూరో సంస్థలలో ఒకటైన ‘ఈక్విఫాక్స్‌’ 1899 సంవత్సరంలో రిటైల్‌ క్రెడిట్‌ బిజినెస్‌గా ప్రారంభమైంది. ఇది 2010లో మనదేశంలో ఆపరేటింగ్‌ లైసెన్స్‌ను పొందింది. ఇది 1 నుంచి 999 వరకు స్కోరును సూచిస్తుంది.

క్రెడిట్‌ స్కోరు ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలి..?

2017 నుంచి ఆర్‌బీఐ లైసెన్స్‌ పొందిన నాలుగు క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలు.. మీ సిబిల్ స్కోరును ఆన్‌లైన్‌లో సంవత్సరానికొకసారి ఉచితంగా చెక్ చేసుకోవడానికి అనుమతినిస్తున్నాయి. ఇప్పుడు ఉచితంగా మీ క్రెడిట్‌ స్కోరును ఎలా తెలుసుకోవాలి అనేది దశల వారిగా తెలుసుకుందాం.

  • మొదట మీకు నచ్చిన సిబిల్‌ వెబ్‌సైట్‌కు వెళ్లండి
  • ఆ తర్వాత మీ పేరు, ఫోన్‌ నంబరు, ఇ-మెయిల్‌ చిరునామా వంటి వివరాలు నమోదు చేయండి.
  • మీ పాన్‌ నంబరుతో సహా ఇతర వివరాలను నింపండి.
  • మీ రుణాలు, క్రెడిట్‌ కార్డుల గురించి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
  • ఈ దశలో స్క్రీన్‌పై వివిధ చెల్లింపు సభ్యత్వాలు ఉంటాయి.
  • మీకు ఉచిత క్రెడిట్‌ స్కోరు రిపోర్ట్‌ మాత్రమే అవసరం కాబట్టి No Thanks మీద క్లిక్‌ చేయండి.
  • ఇప్పుడు మీ ఖాతా క్రియేట్‌ అయినట్లు మెసేజ్‌ డిస్‌ప్లే అవుతుంది.
  • ఆ తర్వాత మీ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, మీ ఖాతాకు లాగిన్‌ అవ్వాలి.
  • మీ నమోదిత ఈ-మెయిల్‌కు వచ్చిన వన్‌-టైమ్‌ పాస్‌వర్డ్‌ను లింక్‌పై క్లిక్‌ చేసి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి.
  • మీరు లాగిన్‌ అయిన తర్వాత, మీరు ఇంతకు ముందు నమోదు చేసిన వ్యక్తిగత వివరాలన్నీ డిఫాల్ట్‌గా మీ స్క్రీన్‌ మీద కనిపిస్తాయి.
  • ఇప్పుడు మీ ఫోన్‌ నంబర్‌ను నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయండి.
  • మీ డ్యాష్‌బోర్డ్‌పై మీ సిబిల్‌ స్కోరు ప్రత్యక్షమవుతుంది. క్రెడిట్‌ నివేదికను కూడా డ్యాష్‌బోర్డ్‌లో పొందవచ్చు.

(ఇది కూడా చదవండి: No-Cost EMI: నో కాస్ట్‌ ఈఎంఐతో లాభమా? నష్టమా? ఎప్పుడు నో కాస్ట్‌ ఈఎంఐ ఎంచుకోవాలి..?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles