Sunday, November 24, 2024
HomeBusinessమీరు కోటీశ్వరులు కావడానికి టాప్-5 పెట్టుబడి పొదుపు పథకాలు ఇవే!

మీరు కోటీశ్వరులు కావడానికి టాప్-5 పెట్టుబడి పొదుపు పథకాలు ఇవే!

నీరు ఏ దారిలో పారాలో మనం దారి చూపించకపోతే అవి దానికిష్టమైన దారిలో పారుతుంది. అందుకే, మన అవసరాల కోసం నదులకు ఆనకట్టలు కట్టి ఆ నీటిని పొదుపుగా వాడుకుంటాం. ఆదే విదంగా మన జీవితంలో కూడా డబ్బును ఎందులో ఇన్వెస్ట్ మెంట్ చేయాలో తెలుసుకోకపోతే చివరకు డబ్బు వృదాగా ఖర్చు అవుతుంది. కాబట్టే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్టుబడుల సాధానాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.

అందుకే, మీరు కోటీశ్వరులు కావడానికి టాప్-5 పెట్టుబడి పొదుపు పథకాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రభుత్వ బాండ్లు:

కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత పెట్టుబడి దారులు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బాండ్లకు సంబంధిత మొత్తాన్ని చెల్లించి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటికి టెన్యూర్ ఉంటుంది. ఆ టెన్యూర్ కాలానికి ప్రభుత్వం ప్రతి ఏడాది కొంత వడ్డీని చెల్లిస్తుంది. టెన్యూర్ ముగిసిన తర్వాత బాండ్లను కొనుగోలు చేసిన మొత్తం, వడ్డీని కలిపి ఇస్తుంది. అటువంటి బాండ్లను కొనుగోలు చేయడానికి మీకు బ్యాంక్ ఖాతా ఉండాలి లేదా మీరు వాటిని మీ డీమ్యాట్ ఖాతాలో కూడా ఉంచుకోవచ్చు.

పెట్టుబడి మొత్తం: ఆఫర్ సమయంలో బాండ్ల ధరను ప్రభుత్వం వెల్లడిస్తుంది. ఉదాహరణకు ఒక్కో బాండు ధర రూ.1000 అయితే మీరు లక్షవిలువ చేసే బాండ్లు కొనుగోలు చేస్తే మొత్తం బాండ్లమీద ఏడాదికి వడ్డీ మొత్తం చెల్లిస్తుంది. ఈ బాండ్లను ప్రభుత్వం నిర్దేశించిన బ్యాంకుల్లో కొనుగోలు చేయొచ్చు.

- Advertisement -

పెట్టుబడిపై రాబడి: ప్రభుత్వ బాండ్‌లలో చాలా వరకు ఫిక్స్‌డ్ రేట్ బాండ్‌లే ఉంటాయి. అయితే, కొనుగోలు సమయంలో కొంత వడ్డీని నిర్ణయిస్తుంది.

మెచ్యూరిటీ సమయం: బాండ్లను కొనుగోలు చేసే సమయంలో ఆ బాండ్ల మెచ్యూరిటీ సమయం ఎంత అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బాండ్ మెచ్యూరిటీ ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)

సురక్షిత పెట్టుబడి ప్రణాళికలలో ఒకటి. నష్టం భయం ఉండదు. రాబడి కూడా వస్తుంది.

లభ్యత: వయోపరిమితి లేకుండా దాదాపు అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అయితే మైనర్ ఖాతాను 18 ఏళ్ల వయస్సు వరకు గార్డియన్ బాధ్యతలు నిర్వహిస్తారు.

పెట్టుబడి మొత్తం: ఒక వినియోగదారు సంవత్సరానికి రూ. 500 నుండి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఏడాదికి 1 నుండి 12 సార్లు డిపాజిట్ చేయొచ్చు.

- Advertisement -

పెట్టుబడి పై రాబడి: ప్రస్తుతం పీపీఎఫ్‌పై వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. అయితే, వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంది. గమనించాల్సి ఉంది.

మెచ్యూరిటీ: సాధారణంగా మెచ్యూరిటీ సమయం సుమారు 15 సంవత్సరాలు. పెట్టుబడిదారులు ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఐదేళ్ల తర్వాత ఉపసంహరించుకోవచ్చు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్

భవిష్యత్ లో ఆర్ధిక ఇబ్బందుల నుంచి సురక్షితంగా ఉండేదుకు వీలుగా నెలవారీ చొప్పున పోస్టాఫీసుల్లో పొదుపు చేసుకోవవ్చు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ లో పొదుపు చేయాలనుకునేవారు పోస్టాఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మినిమం రూ1000 వరకు డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా సింగిల్ అకౌంట్ ఖాతాదారులైతే రూ.9లక్షలు, జాయింట్ అకౌంట్ రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. జాయింట్ ఖాతాలకు గరిష్టంగా రూ.4.50 లక్షలు అవసరం.

ప్రీమెచ్యూర్ క్లోజ్: అకౌంట్ ఓపెన్ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏడాది తర్వాత మూడేళ్ల లోపు అకౌంట్ క్లోజ్ చేస్తే ప్రిన్సిపల్ అకౌంట్ నుంచి 2శాతం తగ్గుతుంది. 3ఏళ్ల తర్వాత ఐదేళ్ల లోపు అయితే 1శాతం వసూలు చేస్తారు.

- Advertisement -

ఎంత వడ్డీ వస్తుందంటే?: ఈ పథకం సంవత్సరానికి 6.60 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఈ మొత్తం నెలవారీగా పొందవచ్చు. డిపాజిట్ నుండి వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGBలు)

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB).వీటిని ఆర్బీఐ జారీ చేసింది. ఇందులో కనీసం 1 గ్రాము పెట్టుబడితో బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

సావరిన్ గోల్డ్ బాండ్స్ ను ఆర్బీఐ జారీ చేస్తుంది. వీటిని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో, స్టాక్ బ్రోకరేజీ సంస్థల్లో పొందవచ్చు.

పెట్టుబడి: ఒక వ్యక్తి వ్యక్తుల కోసం గరిష్టంగా 4 కిలోలకు సమానమైన సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం, పెట్టుబడి మొత్తం ఒక్కొక్కటి రూ.50 తగ్గింపుతో అందుబాటులో ఉంది.
మెచ్యూరిటీ: ఎస్ జీ బీల మెచ్యూరిటీ వ్యవధి ఎనిమిది సంవత్సరాలు. ఐదేళ్ల తర్వాత ప్లీమెచ్యూర్ క్లోజ్ చేసుకోవచ్చు.
వడ్డీ: ఎస్-జీబీ పెట్టుబడిపై రాబడి 2.5 శాతం. ఏడాదికి రెండుసార్లు పొందవచ్చు. సంపాదించిన వడ్డీపై పన్ను ఉంటుంది. అయితే, మెచ్యూరిటీపై ఆర్జించిన లాభంపై పన్ను లేదు.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్:

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది మంచి రాబడిని పొందడానికి మీ డబ్బును విభిన్న స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గం.

లభ్యత:సెబీ గుర్తింపు పొందిన వ్యక్తులు, ఏజెన్సీలు, బ్రోకర్లు, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్‌ల సహాయంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

పెట్టుబడి: చాలా మ్యూచువల్ ఫండ్‌లు కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ట మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి, మీకు డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ అవసరం.

మెచ్యూరిటీ: పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్ల వరకు ఉంటుంది.

వడ్డీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా ఇతర రకాల మ్యూచువల్ ఫండ్ తో పోలిస్తే ఎక్కువ వడ్డీ ని అందిస్తాయి. రాబడులు మార్కెట్ హెచ్చుతగ్గులు,దేశ ఆర్థిక పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. స్వల్పకాలిక మూలధన లాభంలో 15 శాతం వద్ద పన్ను 5 శాతం సెస్‌ వర్తిస్తుంది. దీర్ఘకాలిక మూలధన లాభం 1 లక్ష కంటే తక్కువ ఉంటే, అది పన్ను రహితం. లేకపోతే, మొత్తం 10 శాతం మరియు 4 శాతం సెస్‌తో పన్ను విధించబడుతుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles