Monday, December 30, 2024
HomeReal EstateRERA: రెరాలో మీరు కొనే ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా..!

RERA: రెరాలో మీరు కొనే ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా..!

Check Project Details in RERA: ఆకాశహర్మాలు, విలాసవంతమైన అపార్టమెంట్లతో రోజు రోజుకి మెట్రో నగరాలలో స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందుతోంది. అలాగే, మన హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో కూడా సరికొత్త హంగులతో భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మన నగరంలో స్థిరాస్తి ధరలు భారీగా పెరిగిపోవడంతో దిగువ, మధ్య తరగతి ప్రజలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నగర శివారు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇదే క్రమంలో అవగాహన రాహిత్యంతో కొందరు కొనుగోలుదారులు అనుమతులు లేని ప్రాజెక్టులో కొని విలువైన తమ డబ్బులను నష్టపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ఇల్లు/ఫ్లాట్, స్థలం కొనుగోలు చేసేముందే కొన్ని జాగ్రత్తలు పాటించాలని స్థిరాస్తి నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. నిర్మాణ అనుమతుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని చెబుతున్నారు.

(ఇది కూడా చదవండి: Registration Charges: తెలంగాణలో భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు..!)

రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అనుమతి ఉన్న ప్రాజెక్ట్‌లలో ప్లాట్ కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, అన్నీ అనుమతులు సరిగ్గా ఉంటేనే అ ప్రాజెక్టుకి రేరా రిజిస్ట్రేషన్‌ నంబరును కేటాయిస్తుంది. అయితే కొన్ని సంస్థలు తమ బ్రోచర్లలో అనుమతి రాకముందే రెరా రిజిస్ట్రేషన్‌ నంబరుతో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తుంటాయి. వీటితో అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత ప్రాజెక్టుకు రెరా ఆమోదం ఉందా? లేదా? అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.

RERA: రెరాలో మీరు కొనే ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా..!

  • ముందుగా తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్‌ https://rera.telangana.gov.in/Home/OrdersofAuthorityను సందర్శించాలి.
  • సర్వీసెస్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
  • అనంతరం సెర్చ్‌ ప్రాజెక్టు డీటెయిల్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ప్రాజెక్టు పేరు, ప్రమోటర్‌ పేరు లేదా రిజిస్ట్రేషన్‌ నంబరును నమోదు చేసి సెర్చ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు అ ప్రాజెక్టు వివరాలు, రిజిస్ట్రేషన్‌ స్థితిని తెలిపే పట్టిక కనిపిస్తుంది.

రేరాలో ఫిర్యాదు చేయడం ఇలా..

నమోదిత రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి బిల్డర్లు, డెవలపర్‌లపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు టీజీరెరా తమ వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించారు. వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయడానికి కింది దశలను అనుసరించాలి.

  • తెలంగాణ రెరా వెబ్‌సైట్‌ని సందర్శించి సర్వీస్‌లలోని రిజిస్టర్‌ కంప్లెయింట్‌పై క్లిక్‌ చేయాలి.
  • తదుపరి పేజీలో ఫిర్యాదు ఫారమ్‌ని ఉపయోగించి లాగిన్‌ అవ్వాలి. మీరు కొత్త వినియోగదారుడు అయితే.. ముందుగా పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి https://rerait.telangana.gov.in/?MenuID=50 లింక్‌ను ఓపెన్‌ చేయాలి.
  • మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి కచ్చితమైన సమాచారంతో ఫిర్యాదు ఫారంని పూరించాలి.
  • అవసరమైన పత్రాలు, ఆధారాలతో పాటు ఫిర్యాదును సమర్పించాలి. అనంతరం తెలంగాణ రెరా అథారిటీ సంబంధిత ఫిర్యాదును సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
  • అలాగే, వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనే అవకాశం ఉంది.

ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన రెరా నిబంధనలు..

  • రెరా గుర్తింపు లేకుండా 8 ఫ్లాట్లు/500 చ.మీ./600 గజాలు దాటిన స్థలంలో నిర్మాణాలను ప్రారంభించరాదు. ముందస్తుగా అలాంటి స్థలంలో ఎలాంటి అమ్మకాలు చేపట్టకూడదు.
  • దరఖాస్తు చేసే సమయంలోనే ఈ రంగంలో ఉన్న అనుభవం, నిర్మాణానికి కావాల్సిన మూలధన వివరాలను రెరాకు వెల్లడించాల్సి ఉంటుంది.
  • కొనుగోలుదారుల నుంచి పొందిన సొమ్ములో 70 శాతం ప్రత్యేక ఖాతాలో జమ చేసి.. దానికి అనుగుణంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు రుజువులు చూపించాలి. ప్రతి త్రైమాసిక జమా ఖర్చుల వివరాలను రెరా అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది.
  • కొనుగోలుదారుడి వద్ద ఆస్తి విలువలో 10 శాతం కంటే ఎక్కువగా అడ్వాన్స్‌ తీసుకుంటే ఇరువురి మధ్య ఒప్పదం కచ్చితంగా కుదుర్చుకోవాలి.
  • అడ్వాన్స్‌ తీసుకున్నప్పుడే ఇంటిని స్వాధీనపర్చే తేదీని లిఖితపూర్వకంగా తెలపాలి. సకాలంలో నిర్మాణం పూర్తికాకపోతే రెరా సిఫార్సు చేసిన వడ్డీని ప్రతీనెల కొనుగోలుదారుడికి సమర్పించాలి.
  • ప్లాన్‌లో పేర్కొన్న నమూనా ప్రకారం కాకుండా బిల్డర్‌ నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయాలనుకున్నప్పుడు ముందుగా కొనుగోలుదారుల నుంచి లిఖితపూర్వక సమ్మతి తీసుకోవాలి.
  • నిర్మాణంలో ఉన్న ఇల్లు/ఫ్లాట్‌ పురోగతిని ప్రతీ మూడు నెలలకు ఒకసారి నివేదిక, నిర్మాణ ఫొటోల ద్వారా.. రెరా వెబ్‌సైట్‌లో కొనుగోలుదారులు చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలి.
  • నిర్మాణ/నాణ్యత లోపాలకు 5 ఏళ్ల వరకు బిల్డరే బాధ్యుడిగా రెరా చట్టంలో పేర్కొన్నారు. ఏదైనా లోపాలను కొనుగోలుదారుడు బిల్డర్‌ దృష్టికి తీసుకెళితే.. ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకుండా మరమ్మతులు చేసి అప్పగించాలి.
  • నిర్మాణం చేపట్టేటప్పుడు దాని వివరాలను ముందుగా రెరాలో నమోదు చేయాలి. నమోదు చేయకుండా ప్రాజెక్టుకు సంబంధించి మీడియాలో ప్రకటనలు, కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతర ప్రకటనలు చేయకూడదు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles