Aadhar-Ration Card Link Details in Telugu: ఆధార్ – రేషన్ లింక్ పై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్- రేషన్ కార్డ్ లింక్ గడువు తేదీని పొడిగించింది. గత ఏడాది ఆగస్ట్ 2న కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 (NFSA) ప్రకారం..75శాతం గ్రామాల్లో, 50శాతం పట్టణ ప్రజలు రేషన్ కార్డ్ లబ్ధిదారులుగా ఉన్నారని వెల్లడించింది. అదే సమయంలో బోగస్ రేషన్ కార్డుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలిపింది.
(ఇది కూడా చదవండి: EPF/EPS ఖాతాలో ఉన్న మొత్తం నగదు ఎలా విత్ డ్రా చేయాలి?)
2013 నుంచి 2016 జులై మధ్య కాలంలో 2.16 కోట్ల బోగస్ రేషన్ కార్డులను గుర్తించి వాటిని తొలగించినట్లు వెల్లడించింది. భవిష్యతులో ఈ తరహా ఫేక్ రేషన్ కార్డులను అరికట్టేందుకు రేషన్ కార్డ్’కు ఆధార్ లింక్ చేసే విధానాన్ని మరింతం విస్తృతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా రేషన్ కార్డుకు ఆధార్ లింక్ గడువు తేదీని జూన్ 30, 2024కి విధించింది. ఆ గడువు ముగియనున్న తరుణంలో ఆధార్-రేషన్ కార్డ్ లింక్ చేసే గడువు ఇప్పుడు సెప్టెంబర్ 30, 2024 వరకు పొడిగించబడింది.
ఆన్‌లైన్‌లో రేషన్ కార్డ్‌తో ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి?
- అధికారిక పబ్లిక్ డిస్టిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. మీ రాష్ట్ర PDS వెబ్‌సైట్ లేదా అధికారిక ఆధార్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- అక్కడ అవసరమయ్యే లాగిన్ వివరాల్ని ఎంటర్ చేయాలి. అనంతరం
- రేషన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేసే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అక్కడ మీ రేషన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
- కావాల్సిన సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత ధృవీకరణ కోసం మీరు మొబైల్ నంబర్‌కు ఓటీపీ (వన్-టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది.
ఆఫ్ లైన్‌లో రేషన్ కార్డుతో ఆధార్ ఎలా లింక్ చేయాలి?
- రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లను మీకు సమీపంలో ఉన్న రేషన్ షాపుకి వెళ్లిండి. లేదా PDS (మీ సేవలో సైతం ఈ సౌకర్యం ఉంది) కేంద్రానికి వెళ్లండి.
- మీ వెంటరేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ (అసలు, ఫోటోకాపీ), పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అవసరం ఉంటుంది.
- అనంతరం రేషన్ కార్డ్ కు ఆధార్ లింక్ చేసేందుకుందు ఫారమ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. సదరు ఫారమ్ పై వివరాల్ని పూర్తి చేసి.. మీరు వెంట తీసుకెళ్లిన జిరాక్స్ లను ఆ ఫారమ్ కు జత చేసి పీడీఎస్ అధికారికి సమర్పించండి.
- బయోమెట్రిక్ ప్రమాణీకరణ: ఆధార్ వివరాలను ధృవీకరించడానికి అధికారి బయోమెట్రిక్ (ఫింగర్‌ప్రింట్ స్కానింగ్) అడిగి అవకాశం ఉంటుంది.
- ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మీ రేషన్ కార్డ్ కు ఆధార్ కార్డ్ జత అవుతుంది.
ఆధార్-రేషన్ కార్డ్ లింకింగ్ స్టేటస్ తెలుసుకోవాలంటే?
ఆధార్ సైట్ ను ఓపెన్ చేసి అందులో ఆధార్ స్టేటస్ ను లింక్ చేయండి అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ అవసరమైన వివరాలు అంటే మీ రేషన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్, గుర్తింపు వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ ఆధార్-రేషన్ కార్డ్ లింకేజ్ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.