Monday, October 14, 2024
HomeHow ToEPF/EPS ఖాతాలో ఉన్న మొత్తం నగదు ఎలా విత్ డ్రా చేయాలి?

EPF/EPS ఖాతాలో ఉన్న మొత్తం నగదు ఎలా విత్ డ్రా చేయాలి?

EPF, EPS Full Amount Withdraw Online in Telugu: వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగం చేసుకునే వారి ఆర్ధిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి(EPF), ఉద్యోగి పెన్షన్ పథకాలు(EPS)ను తీసుకొని వచ్చింది. ఈ రెండు పథకాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహిస్తుంది.

ఈ పథకాలలో డబ్బులు జమ చేసిన వారు కొన్ని అనివార్య కారణాల వలన ఉద్యోగం మానేసినప్పుడు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఉపసంహరించుకోవాలి అని అనుకుంటారు. అయితే, ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఒక శుభవార్త చెప్పింది. ఇప్పుడు మీ ఖాతాలో ఉన్న మొత్తం నగదును ఉపసంహరించుకోనే వేసులుబాటును కల్పించింది.

(ఇది కూడా చదవండి: Check EPF Balance: మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ నాలుగు విధాలుగా చెక్ చేసుకోండి ఇలా..!)

అయితే, మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం నగదును విత్ డ్రా చేయాలి అంటే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

  • ఏదైనా కొత్త సంస్థలో చేరేటప్పుడు పాత సంస్థలో మీ ఈపిఎఫ్ ఖాతాను Exit చేయాల్సి ఉంటుంది.
  • కనీసం మీ ఖాతాలో 2 నెలలు నగదు జమ కాకుండా ఉండాలి.
  • ఒకవేళ మీరు జాబ్ మానేసి ఏడాది కంటే ఎక్కువ అయితే.. Form 15G నింపాల్సి ఉంటుంది.

EPF/EPS ఖాతా నుంచి మొత్తం నగదు ఎలా విత్ డ్రా చేయాలి?

  • మొదట పైన చెప్పిన విదంగా అన్నీ నియమాలు పాటించాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత మెంబర్ ఈ-సేవా పోర్టల్‌లోకి లాగిన్ అయి.. ఉద్యోగులు మెనులో ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ట్యాబ్‌ను ఎంచుకోవచ్చు.
  • ఇప్పుడు మీ బ్యాంకు ఖాతాను Verify చేసి Proceed for Online Claim మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత మీరు గనుక జాబ్ మానేసి ఏడాది Form-15G నింపి Upload చేయాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు EPF సెటిల్‌మెంట్ కోసం ఫారమ్ 19ని ఎంచుకోండి.
  • ఆ తర్వాత మీ చిరునామా వివరాలు నమోదు చేసి ఆధార్ ఓటీపీతో వేరిఫై చేయాల్సి ఉంటుంది.
  • మళ్ళీ ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్’ ట్యాబ్‌ క్లిక్ చెప్పిన విదంగా చేసిన తర్వాత EPS సెటిల్‌మెంట్ కోసం ఫారమ్ 10C ఎంచుకొని ఆధార్ ఓటీపీతో వేరిఫై చేయాల్సి ఉంటుంది.
  • చివరగా 4 లేదా 5 పని దినలలో మీ బ్యాంకు ఖాతాలో EPF/EPS ఖాతాలో ఉన్న మొత్తం నగదు జమ అవుతుంది.

ఈపీఎఫ్ గురుంచి ఏదైనా సహాయం కావాలంటే 6302212352కి కాల్ చేయండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles