EPF New Withdraw Rules: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) నగదు విత్ డ్రా విషయంలో ఓ కొత్త రూల్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నిబంధనతో ఆపత్కాల సమయాల్లో ఉద్యోగులు మరింత సులభంగా తమ పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం లభించింది. ప్రతి ఉద్యోగి ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా ఈపీఎఫ్ఓ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసి.. ఆ గండం నుంచి గట్టెక్కడం సర్వ సాధారణంగా జరుగుతుంది.
అదే సమయంలో టెక్నాలజీ వినియోగంతో పెరిగిపోతున్న సైబర్ దాడులు, ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం, ఒకే ఉద్యోగి రెండేసి సంస్థల్లో పనిచేయడంతో పాటు ఇతర కారణాల వల్ల నగదు ఉపసంహరణ విషయంలో ఈపీఎఫ్ఓ యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధులను అమలు చేయడం, వాటికి అనుగుణంగా కేవైసీ డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోతే ఉద్యోగి విత్ డ్రా విజ్ఞప్తిని రిజెక్ట్ చేయడం కొనసాగుతూ వస్తోంది.
(ఇది కూడా చదవండి: EPF/EPS ఖాతాలో ఉన్న మొత్తం నగదు ఎలా విత్ డ్రా చేయాలి?)
దీని వల్ల ఉద్యోగులు ఆర్ధికంగా ఇబ్బంది పడుతుండడంతో పాటు కొన్నిసార్లు పీఎఫ్ ఆఫీస్ ల చుట్టు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తుంది. ఉద్యోగులతో పాటు పెన్షనర్లు ఈ సమస్యలు తలెత్తడం, వాటిపై వేలాది సంఖ్యలో ఫిర్యాదులు అందుకోవడంతో తాజాగా, పీఎఫ్ విత్ డ్రా నిబంధనల్ని ఈపీఎఫ్ఓ సడలించింది. ఇప్పటివరకు క్లెయిమ్ కోసం చెక్, బ్యాంక్ పాస్ బుక్ కాపీలు తప్పనిసరి. ఇవి లేవంటే విత్ డ్రా రిజెక్ట్ అయ్యేది.
అందుకే ఇకపై ఉద్యోగులు వారి పీఎఫ్ ను విత్ డ్రా చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓలో వాటిని అప్ లోడ్ చేసే అవసరం లేకుండా.. నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించ్చింది. విత్ డ్రా చేసుకోవాలనుకుంటే బ్యాంకుల్లో కేవైసీ వివరాల్ని అందించాల్సి ఉంటుంది. బ్యాంక్ అధికారులు కేవైసీ ఆమోదిస్తే సరిపోతుంది. డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కేవైసీ పూర్తి చేసిన వారి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించినట్లైంది.
మూడు రోజుల్లో చేతిలోకి నగదు
అదే సమయంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకున్న తర్వాత ఆ మొత్తం ఉద్యోగి ఖాతాలో జమ అయ్యేందుకు పది నుంచి నుంచి ఇరవై రోజుల సమయం పట్టేది. ఈ ప్రాసెస్ మరింత సులభం అయ్యేలా ఆటో సెటిల్ మెంట్ ప్రాసెస్ అనే ఆప్షన్ ను అందుబాటులోకి తేవడంతో ఈపీఎఫ్ఓలో నగదు విత్ డ్రా అయ్యేందుకు కేవలం 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది.
ఇందుకోసం కొన్ని నిబంధనలు విధించింది. వాటి ఆధారంగా 68జే, 68కే, 68బీ ఇలా మూడు నిబంధనలు అమలు చేసింది. ఈ నిబంధనలకు లోబడి ఆటో సెటిల్ మెంట్ చేసుకోవచ్చు. 68జేలో రూ.50 వేల నుంచి రూ.లక్షవరకు, 68కే, 68బీ నిబంధన కి రూ.లక్ష వరకూ ఆటో సెటిల్మెంట్ పొందొచ్చు.