Is Prepayment of Your Home Loan a Good Idea?: హోంలోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? తీసుకున్న లోన్ ను ముందుగా చెల్లించవచ్చా? అలా చేస్తే లాభమా? నష్టమా? ఇదిగో ఇలాంటి ప్రశ్నలన్నీ లోన్ తీసుకునే సమయంలో, లేదంటే అదనపు ఆదాయం సమకూరినప్పుడు ఉత్పన్నమవుతుంటాయి. అయితే హోంలోన్ చెల్లింపుల విషయంలో ఆర్ధిక రంగ నిపుణులు సలహా ప్రకారం.. హోంలోన్ ముందుగా చెల్లించడమే మంచిదని సలహా ఇస్తున్నారు. అందుకు గల కారణాల్ని వారు వివరిస్తున్నారు.
హోంలోన్ చెల్లించే ప్రారంభ సంవత్సరాల్లో ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాలలో(EMI)పై వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ ఆ వడ్డీ తగ్గుతుంది. ఒకవేళ మీరు బ్యాంకులు నిర్ధేశించిన హోం లోన్ చెల్లింపుల గడువు తేదీల కంటే ముందుగా చెల్లిస్తే హోమ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గడం, వడ్డీ భారం కూడా తగ్గుతుందని, కాబట్టి ఆర్థిక సలహాదారులు గృహ రుణాన్ని ముందుగానే చెల్లించాలని సిఫార్సు చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్ ధరకు అనుగుణంగా హోంలోన్ వడ్డీ రేట్లు దాదాపు 9 శాతంగా ఉన్నాయి. ఫలితంగా పెరిగిన నిత్యవసర వస్తువల ధరలు కారణంగా హోంలోన్ చెల్లించడం కాస్త భారంగా ఉంటుంది. అయినప్పటికీ గృహ రుణాన్ని ముందుగా చెల్లిస్తే రాబోయే కాలంలో ఆర్ధిక ఇబ్బందులు ఉండవని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.
(ఇది కూడా చదవండి: ITR: ఆదాయం రూ.7 లక్షల కంటే తక్కువ ఉన్నా ITR ఫైల్ చేయాలా?)
అంతేకాదు వాటి అనుగుణంగా హోంలోన్’ను ముందుగా చెల్లించడం వల్ల కలిగే లాభాల్ని టెన్యూర్, లోన్ మొత్తం, వడ్డీ రేట్లను ఉదహరిస్తూ హోంలోన్ రీపే వల్ల కలిగే లాభాలేంటో చెప్పకనే చెబుతున్నారు.
గృహ రుణం:
మీరు 9 శాతం వడ్డీ రేటుతో 25 సంవత్సరాల కాలానికి రూ. 75 లక్షల గృహ రుణం పొందారని అనుకుందాం. మీరు నెలకు రూ. 62,940 ఈఎంఐ చెల్లిస్తున్నారు. 25 సంవత్సరాల కాలవ్యవధిలో మీరు రూ. 75 లక్షల ప్రిన్సిపల్( మీరు హోంలోన్ పై తీసుకున్న అసలు మొత్తం)తో పాటు ఒక కోటి 14 లక్షల రూపాయల వడ్డీని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా మీరు హోంలోన్ టెన్యూర్ 25ఏళ్లలో తీసుకున్న అసలు మొత్తం కంటే..మీరు చెల్లించే ఈఎంఐ ప్లస్ వడ్డీ రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. మరింత క్లుప్తంగా వివరించాలంటే?
ప్రిన్సిపల్ అమౌంట్ (మీరు తీసుకున్న మొత్తం హోంలోన్ ): రూ. 75 లక్షలు
లోన్ టెన్యూర్ : 25 సంవత్సరాలు
వడ్డీ రేటు: సంవత్సరానికి 9శాతం (వడ్డీ రేట్లు మారింత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది)
నెలవారీ ఈఎంఐ : నెలకు రూ.62,940
మొత్తం 25 ఏళ్లకు చెల్లించే మొత్తం :
నెలవారీ ఈఎంఐ (రూ.62,940) × 12 నెలలు × 25 సంవత్సరాలు (300 నెలలు)
ఆ లెక్కన మీరు నెలకు రూ.62,940 *300 నెలలు = రూ. 1,88,82,000
చెల్లించిన వడ్డీ :
రూ 1,88,82,000 లో అసలు మొత్తాన్ని రూ 75,00,000 (మొత్తంలోన్ వ్యాల్యూ) తీసివేస్తే.. చెల్లించిన మొత్తం వడ్డీ = రూ. 1,13,82,000
ఇప్పుడు, చెల్లించిన మొత్తం వడ్డీని (రూ. 1,13,82,000) పరిశీలిస్తే తీసుకున్న అసలు రుణం (రూ. 75,00,000) కంటే ఎక్కువ చెల్లిస్తున్నారు.
అలా కాకుండా మీరు గృహ రుణాన్ని ముందుగా చెల్లిస్తుంటే
మొదటి సంవత్సరంలో 89 శాతం ఈఎంఐ ఏడాదికి మొత్తం కలుపుకుని (12 x రూ. 62,940)లో 11 శాతం అసలు, ప్లస్ వడ్డీ రూ. 7.55 లక్షలు చెల్లిస్తారు. ఇలా ఆ మొత్తం అసలు ప్లస్ వడ్డీ 10వ సంవత్సరంలో వడ్డీ భాగం 75 శాతానికి, 15 సంవత్సరంలో 61శాతం , 20వ సంవత్సరంలో 39 శాతానికి తగ్గుతుంది. ఇలా హోంలోన్ పై బ్యాంకులకు చెల్లించే ఈఎంఐ టెన్యూర్ .. వడ్డీ కూడా తగ్గతూ వస్తుంది
హోంలోన్ భారాన్ని తగ్గించుకునేందుకు..పెరిగిన బోనస్’ను హోంలోన్ కింద చెల్లిస్తే
ఏడాది బోనస్ కింద రూ.5,000 పెరిగితే 12*5000=60,000 ఆ మొత్తం బోనస్ నే హోంలోన్ ఈఎంఐకి చెల్లిస్తే సరిపోతుంది. అలా చేస్తే సుమారు రూ.32 లక్షలు ఆదా చేసిన వారవుతారు. ఉదాహరణకు ఏడాదిలో 12నెలలు ఉంటే అందులో ప్రతి నెల ఈఎంఐ రూ. 62,940 రూపాయలు చెల్లిస్తున్నారు అనుకుంటే.. ఆ 12 నెలల కాలంలో ఓ నెల ఈఎంఐ అదనంగా చెల్లిస్తే మీ అసలు టెన్యూర్ 25 సంవత్సరాల నుండి 19-20 సంవత్సరాలకు తగ్గిస్తుంది. మీరు వడ్డీ ఖర్చులలో దాదాపు రూ. 32 లక్షలు ఆదా అవుతుంది. కాబట్టి హోంలోన్ ఈఎంఐని ముందుగా చెల్లించి ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు.