Monday, November 4, 2024
HomeHow Toఆన్​లైన్​లో కుల ధ్రువీకరణ(క్యాస్ట్ సర్టిఫికెట్) పత్రం.. ఎలా పొందాలో తెలుసా..?

ఆన్​లైన్​లో కుల ధ్రువీకరణ(క్యాస్ట్ సర్టిఫికెట్) పత్రం.. ఎలా పొందాలో తెలుసా..?

Caste Certificate in Telangana: కుల ధృవీకరణ పత్రం! అదేనండోయ్ క్యాస్ట్ సర్టిఫికెట్. ఇది లేనిదే ఏ పని జరగడంలేదు. ఉదాహరణకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంక్షేమ పథకాలు మీరు పొందాన్నా, అంతెందుకు మీ అబ్బాయో, మీ అమ్మాయో పై చదువుల కోసం అప్లయ్ చేసుకోవాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలన్నా ఈ సర్టిఫికెట్ చాలా అవసరం. దీని ఆధారంగా రాయితీలు పొందవచ్చు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి.

తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే కలిగే ప్రయోజనాలు

  • తెలంగాణ కుల ధృవీకరణ పత్రం విద్యార్థులు ప్రీ, పోస్ట్ సెకండరీ విద్యా సంస్థల నుండి రాయితీలు, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఇది వారి పోస్ట్ గ్రాడ్యుయేట్ వంటి ఉన్నత చదువులకు ఉపయోగ పడుతుంది.
  • పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు హాజరయ్యే అర్హతగల విద్యార్థులు ఫీజు తగ్గింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • తెలంగాణ కుల ధృవీకరణ పత్రం విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ పొందడంలో కూడా సహాయపడుతుంది.
  • కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే షెడ్యూల్డ్ కులాల సభ్యులు రిజర్వేషన్ కోటాలకు అర్హులు.
  • రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే సాంఘిక సంక్షేమ శాఖ కార్యక్రమాల ద్వారా అర్హులైన వ్యక్తులు అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికెట్ పొందాలంటే కావాల్సిన అర్హతలు

  • మీరు భారతదేశ పౌరుడై ఉండాలి.
  • మీకు మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.
  • మీరు తెలంగాణ వాసి అయి ఉండాలి.

తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం అవసరమైన పత్రాలు

  • ఆదాయపు పన్ను రిటర్న్స్ సర్టిఫికేట్ (ట్యాక్స్ చెల్లిస్తుంటే..వృత్తిపరమైన ప్రయోజనాల కోసం)
  • ఆధార్ కార్డు
  • నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై నోటరీ అఫిడవిట్ రూ.10
  • ఆహార భద్రత కార్డు/ రేషన్ కార్డ్

తెలంగాణ కుల ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు, దరఖాస్తుదారు ఇవ్వాల్సిన వివరాలు

  • అభ్యర్థి పేరు (బ్లాక్ అక్షరాలలో)
  • తల్లిదండ్రుల పేర్లు
  • శాశ్వత చిరునామా
  • ప్రస్తుత ఇంటి చిరునామా
  • పుట్టిన స్థలం, పుట్టిన తేదీ వంటి వయస్సు గురించిన వివరాలు

తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి

  • తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. మీసేవలో అప్లయ్ చేసే ఫారమ్ లు లభ్యమవుతాయి.
  • మీ సేవలో ఆన్ లైన్ ద్వారా లేదంటే ఆఫ్ లైన్ ద్వారా పొందిన ధరఖాస్తు ఫారమ్ లో సంబంధిత వివరాల్ని నమోదు చేయాలి. అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్లను జత చేయండి.
  • లావాదేవీ సంఖ్య, అప్లికేషన్ రసీదు సంఖ్య మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.
  • తహశీల్దార్ సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత కుల ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుంది.
  • మీసేవ కేంద్రం నుండి కుల ధృవీకరణ పత్రాన్ని15 రోజుల్లో పొందవచ్చు.

తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికెట్ దరఖాస్తు ఫీజు

తెలంగాణ కుల ధృవీకరణ పత్రాన్ని అభ్యర్థించడానికి, మీసేవా కేంద్రంలో రూ.35 చెల్లించాలి. దరఖాస్తు రుసుము రూ.10.

తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికెట్ స్టేటస్ తెలుసుకోవాలంటే

  • మీరు తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ సేవ వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  • అక్కడ హోమ్‌పేజీలోనే “Know Your Application Status” అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం అప్లయ్ చేసుకునే సమయంలో మీ మొబైల్ కి వచ్చిన లావాదేవీ సంఖ్య, అప్లికేషన్ రసీదు సంఖ్య నమోదు చేయాలి. అనంతరం మీకు మీ క్యాస్ట్ సర్టిఫికెట్ వివరాలు కనిపిస్తాయి.

(ఇది కూడా చదవండి: Income Certificate: ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles