Thursday, November 21, 2024
HomeHow ToBlock Credit Card: మీ క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్, అన్ బ్లాక్ ఎలా చేయాలంటే?

Block Credit Card: మీ క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్, అన్ బ్లాక్ ఎలా చేయాలంటే?

Block Credit Card: ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ సైబర్ నేరాలు బ్యాంకింగ్ రంగంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి… లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

కొన్ని సందర్భాలలో క్రెడిట్ కార్డ్ పోయినా, లేదంటే దొంగిలించిన క్రెడిట్ కార్డ్ గురించి సంబంధిత సమాచారాన్ని మూడు రోజుల్లో సంబంధిత బ్యాంక్కు సమాచారం అందించాలి. లేదంటే క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్నందుకు బ్యాంక్ లు ఎలాంటి బాధ్యత వహించవు. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ ఎలా బ్లాక్ చేయాలి అనేది తెలుసుకుందాం..

క్రెడిట్ కార్డ్‌ని బ్లాక్ చేయడం ఎలా?

మీరు క్రెడిట్ కార్డ్‌ని బ్లాక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి .

ఆన్‌లైన్

ప్రతి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ అపహరణకు గురైన వెంటనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించి బ్లాక్ చేయొచ్చు, అన్ బ్లాక్ చేయొచ్చు.

- Advertisement -

ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ ను ఎలా బ్లాక్ చేయాలంటే?

  • మీ క్రెడిట్ కార్డ్ జారీ చేసిన అధికారిక కంపెనీ వెబ్ సైట్ లేదంటే యాప్స్ లో లాగిన్ అవ్వడండి.
  • వాటిల్లో రిక్వెస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ అపహరణకు గురైందని నివేదించాలి.
  • అనంతరం క్రెడిట్ కార్డ్‌ని బ్లాక్ చేయండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • చివరిగా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
  • అదే సమయంలో పాత క్రెడిట్ కార్డ్ ను బ్లాక్ చేసి కొత్త క్రెడిట్ కార్డ్ ఇవ్వాలని ఆన్ లైన్ లో రిక్వెస్ట్ చేయొచ్చు.
  • మనం పైన పేర్కొన్నట్లుగా క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేసే ప్రాసెస్ లో రీఇష్యూ అనే ఆప్షన్ ను సెలక్ట్ చేస్తే మీకు కొత్త క్రెడిట్ కార్డ్ పొందవచ్చు.

హెల్ప్‌లైన్

అన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ కస్టమర్‌లకు 24*7 సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్నా, లేదంటే అపహరణకు గురైన వెంటనే సంబంధిత బ్యాంక్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయాలని కోరాలి. ఆ సమయంలో అవసరమైన వివరాల్ని వారికి అందించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు మాత్రం చేయొద్దు. ఇక కస్టమర్ సపోర్ట్ కాంటాక్ట్ నంబర్‌లను మీ క్రెడిట్ కార్డ్ జారీ చేసే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

(ఇది కూడా చదవండి: ఇంటి కోసం తీసుకున్న రుణాన్ని ముందుగా చెల్లిస్తే లాభామా? నష్టమా?)

ప్రత్యామ్నాయంగా, మీరు క్రెడిట్ కార్డ్‌ని బ్లాక్ చేయమని మీ అభ్యర్థన కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నంబర్‌లకు SMS కూడా పంపవచ్చు. మీ అభ్యర్థనను స్వీకరించిన తర్వాత, మీ క్రెడిట్ కార్డ్‌ బ్లాక్ అవుతుంది. బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయినట్లు మెసేజ్ వస్తుంది. అలా వస్తేనే మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయినట్లు గుర్తించాలి.

ఆఫ్‌లైన్‌లో

మీకు వీలైతే క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్న తర్వాత సదరు క్రెడిట్ కార్డ్ జారీ చేసిన బ్యాంక్ కు వెళ్లాలి. అక్కడ క్రెడిట్ కార్డ్ బ్లాక్ కు సంబంధించిన ఫారమ్ పూర్తి చేసి బ్యాంక్ అధికారులకు ఇస్తే వాళ్లే క్రెడిట్ కార్డ్ ను బ్లాక్ చేస్తారు.

క్రెడిట్ కార్డ్‌ని అన్‌బ్లాక్ చేయడం ఎలా?

మీ క్రెడిట్ బిల్లుల చెల్లింపులు సక్రమంగా ఉన్నట్లు బ్యాంక్ లు గుర్తిస్తే .. బ్లాక్ అయిన క్రెడిట్ కార్డ్ లు మళ్లీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించే విషయంలో డిఫాల్టర్ అయితే మీ బ్యాంక్ మీ క్రెడిట్ కార్డ్‌ని బ్లాక్ చేయడమే కాకుండా పేమెంట్ చేయని మొత్తంపై భారీ ఛార్జీలను కూడా విధిస్తాయని గమనించాలి.

అయితే, అటువంటి డిఫాల్ట్ 4 సార్లు కంటే ఎక్కువ జరిగితే, మీ క్రెడిట్ కార్డ్ శాశ్వతంగా బ్లాక్ అవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ బ్యాంకుకు మొత్తం రుణాన్ని చెల్లించవలసి ఉంటుంది. అలా చేసిన తర్వాత కూడా, మీ క్రెడిట్ కార్డ్ మళ్లీ యాక్టివేషన్ అయ్యే అవకాశాలు పరిమితంగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles