Sunday, November 3, 2024
HomeHow ToTSSPDCL: ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లులు ఎలా పే చేయాలంటే?

TSSPDCL: ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లులు ఎలా పే చేయాలంటే?

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL)కరెంట్ బిల్లులు చెల్లింపులు కోసం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. జూలై 1, 2024 ఈ కొత్త మార్గ దర్శకాలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు అన్ని బిల్లు చెల్లింపుల కోసం తప్పనిసరిగా TSSPDCL పోర్టల్ లేదా మొబైల్ యాప్‌ని ఉపయోగించి చెల్లించాల్సి ఉంటుంది.

TSSPDCLలో కరెంట్ బిల్లు ఎలా చెల్లించాలి..?

  • TSSPDCL Website లేదంటే App ఓపెన్ చేయండి
  • అందులో మీ కరెంట్ బిల్లు మీద కనిపించే సర్వీస్ కోడ్ నెంబర్ ను ఎంటర్ చేయండి
  • మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • అనంతరం ఎంటర్ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ తర్వాత, ‘పే బిల్’ ఆప్షన్ పై క్లిక్ చేస్తే టీ-వ్యాలెట్ లేదా బిల్ డెస్క్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. చెల్లింపును పూర్తి చేయండి.
  • కరెంట్ బిల్లు పే చేసిన తర్వాత మీరు లావాదేవీని నిర్ధారిస్తూ మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది.
  • వినియోగదారుల ఫిర్యాదుల కోసం టీఎస్ఎస్ పీడీసీఎల్ లో ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి.

TSSPDCL మొబైల్ యాప్ బిల్లు చెల్లింపులను సులభతరం చేయడమే కాకుండా వివిధ వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఫీచర్లను కూడా అందిస్తుంది. యాప్ విద్యుత్ సరఫరా సమస్యలకు సమగ్ర పరిష్కారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిల్లో

వోల్టేజ్ హెచ్చుతగ్గులు: వోల్టేజ్ తగ్గుతున్నా, పెరుగుతున్నా సంబంధించిన సమస్యలను ఫిర్యాదు చేయొచ్చు.
సరఫరా అంతరాయాలు:
విద్యుత్ సరఫరాలో ఏవైనా అంతరాయాలు ఉంటే TSSPDCLకి సమాచారం అందించవచ్చు.
మీటర్ సమస్యలు:
మీటర్ రీడింగ్‌లు లేదా లోపాల్ని పరిష్కరించుకోవచ్చు. ఆందోళనలను పరిష్కరించండి.
విద్యుత్తు అంతరాయాలు:
కరెంట్ పోయినప్పుడు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారులు మీ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉంది.
బిల్లింగ్ ఆందోళనలు:
విద్యుత్ బిల్లులకు సంబంధించిన వివాదాలు లేదా ఇతర సందేహాలను పరిష్కరించుకోవచ్చు.

TSSPDCLలోనే కరెంట్ బిల్లులు ఎందుకు చెల్లించాలి?

టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఆర్బీఐ గుర్తించింది. ముఖ్యంగా పలు పేమెంట్స్ చేసే థర్డ్ పార్టీ యాప్స్ ను టార్గెట్ చేసుకుని ఆయా వైరస్ లను ఉపయోగించి సైబర్ నేరస్తులు సైబర్ దాడులకు పడే అవకాశాలు పెరిగిపోతున్న తరుణంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

(ఇది కూడా చదవండి: మీ క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్, అన్ బ్లాక్ ఎలా చేయాలంటే?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles