పెరిగిపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. నిన్న మొన్నటి వరకు సంప్రదాయ ఇంధన వాహనాల్ని వినియోగించిన వాహన యజమానులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఆటోమొబైల్ రంగం పుంజుకుంది. వాహనాల సేల్స్ జోరందుకున్నాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా కార్ల తయారీ సంస్థలు కొత్త కొత్త మోడళ్లు, అధునాతనమైన ఫీచర్లతో పదుల సంఖ్యలో కార్లను విడుదల చేస్తున్నాయి.
ఆఫర్లు, డిస్కౌంట్లు, జీరో డౌన్ పేమెంట్స్ అంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా.. కార్లలో వినియోగించే బ్యాటరీ మన్నిక, ఛార్జింగ్ పెట్టేందుకు ఎక్కువ సమయం తీసుకోడంతో కొనుగోలు శక్తి ఉన్నప్పటికీ .. ఈవీ కార్ల జోలికి పోవడం లేదు. దీన్ని అర్ధం చేసుకున్న ప్రముఖ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తొలిసారి నెక్ట్స్ జనరేష్ కార్ల ఈవీ బ్యాటరీని తయారు చేసింది.
దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ఎస్ఎన్ఈ బ్యాటరీ డే 2024 ఎక్స్‌పోలో శాంసంగ్ ఈవీ బ్యాటరీ ఫైలెట్ ప్రొడక్షన్ లైన్‌ను ఆవిష్కరించింది. దీంతో ఈవీ రంగంలో శాసంగ్ బ్యాటరీలో గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెక్ట్స్ జనరేషన్ బ్యాటరీ వినియోగం, దాని సామర్ధ్యాల గురించి తెలుసుకునేందుకు వాహనదారులు ప్రయణిస్తున్నారు. తాజాగా, ఆటోమొబైల్ మార్కెట్ లో తొమ్మిది నిమిషాలలో ఛార్జింగ్ నిండే శాంసంగ్ ఈవీ బ్యాటరీని వాహనదారులకు అందించనుంది.
ఒక్కసారి ఛార్జింగ్‌పై 965 కి.మీల వరకు ఎలక్ట్రిక్ వాహనానికి శక్తినివ్వగల సామర్థ్యాన్ని బ్యాటరీ కలిగి ఉంది. అయితే దీనికి 480 కేడబ్ల్యూ, 600 కేడబ్ల్యూ మధ్య వేగాన్ని ఛార్జ్ చేయగలిగేలా మౌలిక సదుపాయాలు అవసరం. అంతేకాకుండా, ఈ బ్యాటరీలు 20 సంవత్సరాల జీవితకాలంతో వస్తాయి. ప్రస్తుత లిథియం-అయాన్ బ్యాటరీల దీర్ఘాయువు కంటే చాలా ఎక్కువ.