Thursday, November 21, 2024
HomeBusinessఈపీఎఫ్‌వోలో కీలక అప్ డేట్.. ఇది ఉద్యోగులకు లాభమా? నష్టమా?

ఈపీఎఫ్‌వోలో కీలక అప్ డేట్.. ఇది ఉద్యోగులకు లాభమా? నష్టమా?

EPFO Update: ఉద్యోగుల ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌వో) విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఉద్యోగులకు భారీ మొత్తంలో లబ్ధి చేకూరే అవకాశం ఉందని సమాచారం. పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కేంద్ర కార్మిక శాఖ వేజ్ సీలింగ్’ను పెంచే ప్రతిపాదనలపై సంబంధిత శాఖ అధికారులతో చర్చిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇంతకీ ఆ వేజ్ సీలింగ్ అంటే ఏమిటి?

కేంద్ర కార్మిక శాఖ సెప్టెంబర్ 1, 2024 నుంచి ఉద్యోగుల నెలవారీ జీతం నుంచి కొంతమొత్తాన్ని, అలాగే వారు పనిచేస్తున్న సంస్థ నుంచి కొంత మొత్తాన్ని కట్ చేస్తాయి. అలా కట్ చేసిన మొత్తాన్ని ఈపీఎఫ్‌వో ఖాతాకు తరలిస్తాయి. ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈపీఎఫ్‌వో అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకునే వెసులు బాటు ఉంది.

ఇలా ఉద్యోగి జీతంలో కొంతమొత్తాన్ని, సంస్థ నుంచి కొంతమొత్తాన్ని తీసుకుని ఈపీఎఫ్‌వో అకౌంట్ కు తరలించే మొత్తాన్ని వేజ్ సీలింగ్ అంటారు. ఈ వేజ్ సీలింగ్ సెప్టెంబర్ 1,2024కు ముందు ఉద్యోగి బేసిక్ శాలరీ 6,500 ఉన్న ఉద్యోగుల జీతం నుంచి పెన్షన్ రూపంలో ఈపీఎఫ్‌వో అకౌంట్ లో డిపాజిట్ చేసేవి. ఆ తర్వాత అంటే సెప్టెంబర్ 1,2024 నుంచి బేసిక్ శాలరీ 15000కి పెంచింది కేంద్రం. ఈ కొత్త వేజ్ సీలింగ్ పద్దతిలో ఉద్యోగుల అకౌంట్ నుంచి రూ.1250, ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ మరో రూ.1250 కలిపి ఈపీఎఫ్‌వో అకౌంట్ కి తరలించేది.

అయితే తాజాగా, కేంద్ర కార్మిక శాఖ ఈ బేసిక్ శాలరీని రూ.21వేలకు పెంచే ప్రతిపాదనలపై కసరత్తు చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈపీఎఫ్‌వో కార్యకలాపాలు నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) సభ్యుల సమావేశం జరిగింది. అనంతరం బేసిక్ శాలరీని పెంచాలని కోరుతూ తమ ప్రతిపాదనలను లోక్ సభ ఎన్నికల తర్వాత మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రం సాధ్యసాధ్యాల గురించి ఆరా తీస్తోంది.

ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. పీఎఫ్ అనేది ఉద్యోగి బేసిక్ శాలరీ మీద ఆధారపడి ఉంటుంది. ఉద్యోగి జీతం, ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ ఇద్దరూ కలిపి ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంది. ఇక్కడ కంపెనీ 8.33శాతం మాత్రమే ఉద్యోగుల పెన్షన్‌ రూపంలో అందిస్తుంది. మిగిలిన 3.67శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్(EPS) ఖాతాలోకి వెళుతుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈపీఎఫ్, ఈపీఎస్ ఫండ్ పై ప్రభావం చూపుతుంది.

- Advertisement -

ప్రస్తుతం, ఈపీఎస్ కంట్రిబ్యూషన్‌లు నెలకు రూ. 15,000 బేసిక్ శాలరీ ఆధార పడి ఉంటుంది. ప్రభుత్వం బేసిక్ శాలరీని రూ.21,000కి పెంచినట్లయితే.. ఉద్యోగి రూ.1749, సంస్థ రూ.1749మొత్తం కలిపి రూ.3498 ఈపీఎఫ్ అకౌంట్ లో జమవుతాయి. అందుకే బేసిక్ శాలరీ రూ.21,000 పెంచితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగి,సంస్థకు లాభమా? నష్టమా? ఒకవేళ బేసిక్ శాలరీని పెంచితే ఉద్యోగి, సంస్థ ఈపీఎఫ్ ఖాతాలో ఎంత జమచేయాలి. ఈపీఎస్ ఖాతాకు సంస్థ ఎంతమొత్తంలో డిపాజిట్ చేయాలనే తదితర అంశాలపై కేంద్ర కార్మిక శాఖ సంబంధిత శాఖ అధికారులతో సమావేశం అయ్యిందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles