ఇల్లు కొనుగోలు చేసేందుకు, పిల్లల చదువుల కోసం, అప్పులు తీర్చేందుకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? అయితే పర్సనల్ లోన్ తీసుకునే ముందు తప్పని సరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫలితంగా లోన్ పొందడమే కాదు.. తీసుకున్న లోన్ పై తక్కువ వడ్డీ పడేలా జాగ్రత్త పడవచ్చు.
ముందుగా పర్సనల్ లోన్ కోసం అప్లయ్ చేసే సమయంలో క్రెడిట్ స్కోర్, వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలను పరిగణలోకి తీసుకోవాలి. మీ లోన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. దీంతో పాటు మీరు ఏ బ్యాంక్, ఫైనాన్స్ సంస్థల్లో లోన్ తీసుకోవచ్చో ఓ స్పష్టత వస్తుంది. టెన్యూర్ తో పాటు మీకు కావాల్సిన లోన్ కంటే ఎక్కువ మొత్తంలో పొందవచ్చు.
సిబిల్ స్కోర్ ఎలా ఉంది?
సిబిల్ స్కోర్ ఆధారంగా పర్సనల్ పొందే అవకాశం ఉంటుంది. అందుకు స్కోర్ 300 – 900 మధ్య ఉండాలి. అందుకు అనుగుణంగా ఆయా రుణ సంస్థలు మీకు లోన్ ఇస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ 685పైన ఉండే లోన్ పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది.
అంతకంటే తక్కువ ఉంటే లోన్ రిజెక్ట్ అవ్వడమో లేదంటే మీరు తీసుకున్న లోన్ పై సాధారాణ వడ్డీ రేట్ల కంటే అధిక మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సిబిల్ స్కోర్ మాత్రమే కాదు మీకు ఎన్ని క్రెడిట్ కార్డ్ లు ఉన్నాయి. వాటిని సకాలంలో పేమెంట్ చేస్తున్నారో పరిశీలించండి. ఎక్కువ క్రెడిట్ కార్డ్ లు లేకుండా ఉంటే మంచింది
వడ్డీ రేట్లు చెక్ చేయండి
లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంక్ లో ఎంత వడ్డీ పడుతుందో తెలుసుకోండి. తద్వారా మీ లోన్ పై తక్కువ వడ్డీ పడే అవకాశాన్ని పొందవచ్చు. ఇలా వడ్డీ రేట్లు చెక్ చేసుకునేందుకు పలు సంస్థలు సేవల్ని అందిస్తాయి. తక్కువ మొత్తంలో చెల్లింపులు జరిపి.. ఏ బ్యాంక్ లో ఎంత తక్కువ వడ్డీకే లోన్ వస్తుందో తెలుసుకోవచ్చు.
ఏయే ఛార్జీలు విధిస్తారో తెలుసుకోవడం మంచిది
లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్, లేట్ పేమెంట్ ఫీజులు ఎంత కట్టాల్సి ఉంటుందో తెలుసుకోండి. అలా అవగాహన ఉండడం వల్ల మీ ఖర్చు నియంత్రణ ఉంటుంది. సకాలంలో ఈఎంఐలు చేసుకోగలుగుతారు.
పర్సనల్ లోన్ ఎంత కావాలి?
మీరు పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారు అనే విషయాలపై శ్రద్ధ వహించాలి. వెహికల్ కొనుగోలు, పెళ్లి ఖర్చు, ఆరోగ్య అవసరాలు తీర్చుకునేందుకా, లేదంటే ఏదైనా టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లేందుకు తీసుకుంటున్నారో స్పష్టత ఉండాలి. ఒకవేళ మీరు ఎంత మొత్తంలో చేయాల్సి వస్తుందో అవగాహన లేకపోతే ఫ్లెక్సీ లోన్ తీసుకోవడం ఉత్తమం.
ఈ తరహా లోన్ లో బ్యాంక్ లు మీకు ఎంతమొత్తంలో లోన్ ఇచ్చేందుకు అర్హులో గుర్తిస్థాయి. మీకు ఆ లోన్ మొత్తాన్ని అందిస్తాయి. అయితే ఇందులో మీకు కావాల్సిన మొత్తాన్ని తీసుకుని .. మిగిలిన అమౌంట్ ను అలాగే ఉంచుకోవచ్చు. మీరు వినియోగించిన నగదు ఆధారంగా వడ్డీ చెల్లించే వెసులు బాటు ఉంటుంది. మిగిలిన అమౌంట్ పై బ్యాంక్ లు వడ్డీని విధించవు.
ఆఫర్ల విషయంలో తస్మాత్ జాగ్రత్త!
కొన్నిసార్లు మన అవసరాల్ని బ్యాంకులు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఆఫర్లు, తక్కువ వడ్డీ రేట్లు పేరుతో మనల్ని ట్రాప్ లో పడేస్తాయి. అలా ఆఫర్ల ఊబిలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. తక్కువ వడ్డీకే లోన్ ఇస్తున్నామని ప్రచారం చేసినా.. సమయాను సారం మనం ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది.