Wednesday, October 16, 2024
HomeBusinessమీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

క్రెడిట్ కార్డ్. వినియోగదారుల అవసరాల్ని తీర్చేలా బ్యాంకులు క్రెడిట్ కార్డ్ రూపంలో అందిస్తున్న అప్పు. క్రెడిట్ కార్డ్ ఉన్న వినియోగదారులు డబ్బుల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. బ్యాంక్ దగ్గరకు వెళ్లి డబ్బులు విత్ డ్రాతో పనిలేదు. కేవలం వస్తువు కొనుగోలు చేసినా, లేదంటే షాపింగ్ చేసిన తర్వాత కార్డ్ స్పైప్ చేస్తే సరిపోతుంది. అయితే చేతిలో కార్డ్ ఉంది కదా అని అవసరానికి మించి వినియోగించారా అంతే సంగతలు ఆర్ధిక ఇబ్బందులు గురి కావాల్సి ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డ్ వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

క్రెడిట్ కార్డ్ పరిమితంగా ఉపయోగించడం

క్రెడిట్ కార్డ్ ను రెగ్యులర్ గా వినియోగించే వారు ఖర్చు పెట్టే విషయంలో నియంత్రణ ఉండాలి. అలా ఉంటేనే క్రెడిట్ కార్డ్ ను వాడుకోవాలి. చాలా మంది క్రెడిట్ కార్డ్ కి డబ్బులు బ్యాంకులు ఇస్తున్నాయని పొరబడుతుంటారు. వాస్తవానికి బ్యాంకులే క్రెడిట్ కార్డ్ రూపంలో మీ దగ్గర నుంచి ఎంతా వసూలు చేయాలో అంత చేస్తాయని విషయం మరిచి పోతారు.

కార్డ్ ఉంది కదా అని అవసరానికి మించి డబ్బు వాడుకుంటారు. తీరా కట్టే గడువు వచ్చే సమయానికి చేతిలో డబ్బులు లేక అప్పులు చేయడం, వడ్డీకి తెచ్చి బిల్ పే చేయడం లాంటివి చేస్తుంటారు. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు మీ ఖర్చును నియంత్రణలో పెట్టుకోవాలి.

క్రెడిట్ కార్డ్ పై జీరో పర్సెంట్ ఇంట్రస్ట్

క్రెడిట్ కార్డ్ పై జీరో పర్సెంట్ ఇంట్రస్ట్ అని చదివి టెంప్ట్ అయ్యారా? అంతే సంగతులు. చాలా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మేం మా క్రెడిట్ కార్డ్ పై జీరో పర్సెంట్ ఇంట్రస్ట్,రివార్డ్ పాయింట్లు, బోనస్ లు అని ఊరిస్తుంటాయి. వాస్తవానికి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటూనే రెన్యువల్ ఛార్జీలు, కిరాణా షాపుల్లో 2.5శాతం సర్ ఛార్జీలు విధిస్తాయి. క్రమం తప్పకుండా వర్తించే వివిధ రకాల ఛార్జీలు ఇయర్ రెన్యువల్ ఛార్జీలు,పొరపాటున క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయకపోతే లేట్ పేమెంట్ ఛార్జీలు, ఈఎంఐ సర్వీసింగ్ ఛార్జీలు,సర్ ఛార్జీలు, విత్ డ్రా ఛార్జీల రూపంలో వసూలు చేస్తుంటాయి.

- Advertisement -

క్రెడిట్ కార్డ్‌లపై వడ్డీ రేట్లు

మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్‌లతో చేసే ప్రధాన తప్పులలో డబ్బు ఉచితంగా వస్తుందని భావిస్తుంటారు. పైగా ఉపయోగించడం వల్ల ఎటువంటి నష్టం ఉండదని, డబ్బులు వినియోగించే కొద్దీ క్యాష్ లిమిట్ పెరుగుతుందని అనుకుంటారు. వాస్తవానికి క్రెడిట్ నుంచి వినియోగించే డబ్బుపై అధిక మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఆ విషయం ఎవరూ పట్టించుకోరు.

క్రెడిట్ కార్డ్ ఉందా వాడుకున్నామా? జీతం వచ్చిన వెంటనే కట్టేస్తున్నామనే చూస్తుంటారు. అలా అని క్రెడిట్ అసలు వద్దని చెప్పడం లేదు. మీ ఖర్చులకు సరిపోయే క్రెడిట్ కార్డ్ ను వాడుకోండి. క్రెడిట్ కార్డ్ పేమెంట్ తేదీలు, రిసిప్ట్ లు అన్నీ భద్రంగా ఉంచుకోవాలి. షాపింగ్ చేసే ముందు మీరు ఏ వస్తువుల్ని ఎంత బడ్జెట్ ధరలో కొనుగోలు చేయాలి అనే విషయాలపై అవగాహన ఉండాలి.

మినిమం పేమెంట్ విషయంలో జాగ్రత్త

క్రెడిట్ కార్డ్ ఇచ్చే సంస్థలు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసే సమయంలో మీరు మొత్తం పేచేయాల్సిన అవసరం లేదని, మినిమం బ్యాలెన్స్ కట్టినా సరిపోతుందని సలహా ఇస్తుంటాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే మొత్తం పేమెంట్ చెల్లిస్తారు. లేదంటే మినిమం పేమెంట్ మాత్రమే కడుతుంటారు. అలా మినిమం పేమెంట్ చేసే కొద్దీ అధిక మొత్తంలో వడ్డీ ఛార్జీలు విధిస్తాయి.
అందుకే క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసే సమయంలో ఎంత వీలైతే అంత ఎక్కువ మొత్తంలో చెల్లించడం ఉత్తమం. వడ్డీ రేట్ల నుంచి బయటపడొచ్చు. పైగా రివార్డ్ పాయింట్లు, బోనస్ లు పొందవచ్చు.

చెల్లింపుల విషయంలో జాగ్రత్త

రోజూవారి దైనందిన జీవితంలో క్రెడిట్ కార్డ్ చెల్లింపు తేదీలను గుర్తుంచుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు మెయిల్స్ , నోటిఫికేషన్లు రాకపోవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ తేదీ దగ్గర పడే సమయంలో మనకు పేమెంట్స్ గురించి తెలిస్తే ఒత్తిడి పెరిగి పోతుంది. చేతిలో డబ్బులు లేక అప్పులు చేస్తుంటాం. అందుకే క్రెడిట్ కార్డ్, లేదంటే ఆర్ధిక లావాదేవీల గురించి కచ్చితంగా ఓ డైరీ రాసుకోవాలి. నెలకు ఒకసారి కూర్చుని, ప్రతి నెలా డబ్బు ఎక్కడ, ఎలా ఖర్చు అవుతున్నాయో పరిశీలించాలి. ఫలితంగా ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు.

మీరు నెలవారీ ఖర్చుల్ని ప్రత్యేకంగా రాసుకోవడం వల్ల ఖర్చుల్ని నియంత్రించవచ్చు. కాకపోతే అందుకు మీ సమయంతో పాటు కొంచెం ధైర్యం కూడా ఉండాలి. మొదట్లో ఈ లెక్కలు అనవసరం అనిపిస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడమే కాదు. ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles