Saturday, March 7, 2026
HomeHow Toభూ భారతి పోర్టల్‌లో మన భూమి వివరాలు తెలుసుకోవడం ఎలా..?

భూ భారతి పోర్టల్‌లో మన భూమి వివరాలు తెలుసుకోవడం ఎలా..?

తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ భూమి వివరాలను డిజిటల్ చేయడం కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో ఈ భూ భారతి పోర్టల్ని తీసుకొచ్చింది. ఈ భూ భారతి పోర్టల్ ద్వారా ప్రతి భూమి వివరాలు తెలుసుకోవడంతో పాటు. రిజిస్ట్రేషన్ వంటి ఇతర సౌకర్యాలు కూడా మనం ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చు.

ప్రస్తుతం మనం ఈ కథనంలో మీ వ్యవసాయ భూమి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

భూ భారతి పోర్టల్‌లో భూమి వివరాలు తెలుసుకోవడం ఎలా..?

  • తెలంగాణలోని భూ భారతి పోర్టల్‌లో భూమి వివరాలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • Information Services విభాగంలో Land Details Search మీద క్లిక్ చేయండి.

సర్వే నెంబర్ ద్వారా భూమి వివరాలు తెలుసుకోవడం..?

  • ఇప్పుడు Survey No./ Sub-Division No అనే ఆప్షన్ ఎంచుకుంటే జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబర్, ఖాతా నెంబర్ వంటి వివరాలు నమోదు చేసిన తర్వాత CAPTCHA కోడ్ నమోదు చేసి Fetch అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ భూమికి చెందిన Total Extent (Ac. Gts), Survey No./ Sub-Division No, Land Status, Nature of Land, Classification of Land, Land Type, Market value of Survey no.(in INR), Transaction Status వివరాలు కనిపిస్తాయి.

పట్టాదారు పాస్‌బుక్ నంబర్ నెంబర్ ద్వారా భూమి వివరాలు తెలుసుకోవడం..?

  • ఇప్పుడు మీ పట్టాదారు పాస్‌బుక్ నంబర్, మీ ఆధార్ నెంబర్ మొదటి నాలుగు నంబర్లు నమోదు చేసి CAPTCHA కోడ్ నమోదు చేసి Fetch అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ భూమికి చెందిన Total Extent (Ac. Gts), Survey No./ Sub-Division No, Land Status, Nature of Land, Classification of Land, Land Type, Market value of Survey no.(in INR), Transaction Status వివరాలు కనిపిస్తాయి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles