FASTag Annual Pass: జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఎక్కువగా ప్రయాణించే వాణిజ్యేతర వాహనల(Non-Commercial Vehicels)ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన రూ.3 వేలతో వార్షిక టోల్‌పాస్(FASTag Annual Pass)ను అమల్లోకి తీసుకొని వచ్చింది.
ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకొనేందుకు ఓ లింక్‌ను రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో రవాణాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), రహదారి రవాణా, హైవే మంత్రిత్వశాఖ (morth) వెబ్‌సైట్లలో కూడా ఈ లింక్ మీకు కనిపిస్తోంది. కార్లు, జీపులు, వ్యాన్‌లు తదితర వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ పాస్ వర్తించనున్నట్లు కేంద్రం పేర్కొంది. దీంతో ఇక టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ కార్డులను పదేపదే రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఎప్పటి వరకు ఈ పాస్ వాడుకోవచ్చు?
రూ.3 వేలతో ఫాస్టాగ్ టోల్‌పాస్ తీసుకునే కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు(ఏది ముందైతే అది) జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. నూతన విధానం వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు(Commercial Vehicels) చెల్లుబాటు కాదు. 200 ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ రూ.3వేలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిలో ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు.
ఎక్కడ ఈ వార్షిక పాస్‌ను కొనగలం?
మనం ఈ వార్షిక పాస్‌ను రాజ్‌మార్గ్ యాత్ర యాప్, ఎన్‌హెచ్‌ఏఐ వెబ్సైట్, morth వెబ్‌సైట్లలో దీనిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
FASTag Annual Passను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
- మొదట మీరు ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల ద్వారా రాజ్ మార్గ్ యాత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- NHAI, MORTH వెబ్‌సైట్లలో కూడా యాక్టివేషన్ లింకులు అందుబాటులో ఉంటాయి.
- ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ద్వారా ఆ యాప్’లో లాగిన్ అయ్యాక Annual Pass అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు వెహికల్ నంబర్ నమోదు చేసి submit మీద క్లిక్ చేస్తే మీ వాహనానికి లింకు అయిన ఫాస్టాగ్ వివరాలు కనిపిస్తాయి.
- ఆ తర్వాత మీ మొబైలు నెంబర్ నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఒక OTP వస్తుంది.
- ఇప్పుడు మీ OTP నమోదు చేసిన తర్వాత Payment Gatewayకి వెళ్ళి రూ.3000 Payment చేసిన తర్వాత రెండు గంటల్లో మీ యాన్యువల్ పాస్ యాక్టివేట్ అవుతుంది.
- ఆ తర్వాత మీకు మొబైల్‌కు ఎస్ఎంఎస్ రూపంలో FASTag Annual Pass వివరాలు మీకు వస్తాయి.
ఏయే టోల్ ప్లాజాలు ఈ వార్షిక పాస్ పరిధిలోకి వస్తాయి?
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలు మాత్రమే ఈ వార్షిక పాస్ పరిధిలోకి వస్తాయి.
ఏ ఏ వాహనాలకు ఈ FASTag Annual Pass వర్తిస్తుంది?
ప్రైవేట్ వాణిజ్యేతర వాహనల(Non-Commercial Vehicels) అయిన కారు, జీపు, వ్యాను వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.?




