తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూభారతి పోర్టల్ ద్వారా మనం మన భూమికి సంబంధించిన అనేక సేవలను పొందవచ్చు. ఈ సేవలలో భాగంగా మీ భూమి గనుక నిషేధిత ఆస్తుల జాబితా(Prohibited Properties List)లో చూపిస్తే. నిషేధిత ఆస్తుల జాబితా నుంచి మీ భూమి ఎలా తొలగించుకోవలో ఈ కథనంలో తెలుసుకుందాం.
🔑 స్టెప్ 1: భూభారతి పోర్టల్‌లో లాగిన్ లేదా రిజిస్ట్రేషన్
- మొదట అధికారిక 👉 భూభారతి పోర్టల్ ఓపెన్ చేయండి.
- ఇప్పుడు Login బటన్‌పై క్లిక్ చేయండి.
- మీరు గనుక కొత్త యూజర్ అయితే → Signupపై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి(యూజర్ రిజిస్ట్రేషన్ మాన్యువల్ చూసుకోవచ్చు).
- ఇప్పటికే రిజిస్టర్ అయితే → మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- OTP ఎంటర్ చేసి Validate OTP పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మీ Citizen Dashboard ఓపెన్ అవుతుంది.
📝 స్టెప్ 2: గ్రీవెన్స్ సర్వీస్‌ను ఎంచుకోవడం
- డాష్‌బోర్డ్‌లో ROR Corrections మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు Grievance relating to inclusion in prohibited properties list పై క్లిక్ చేయండి.
- పౌరులకు సంబంధించిన ఫ్లోస్ చూపబడతాయి. వాటిని చదివి Proceed అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
📑 స్టెప్ 3: ఆస్తి వివరాలు ఇవ్వడం
- ఆ తర్వాత మీకు మాడ్యూల్‌కు సంబంధించిన సమాచారం వస్తుంది. Click Here to Continueపై క్లిక్ చేయండి.
- మీ వద్ద పాస్‌బుక్ నంబర్ (PPB No.) ఉందా అని అడుగుతుంది:
- ఉంటే → PPB నంబర్ ఎంటర్ చేసి Fetch పై క్లిక్ చేయండి.
- లేకపోతే → అవసరమైన వివరాలు ఎంటర్ చేసి Fetch పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
- ఫిర్యాదు చేయాల్సిన సర్వే నంబర్ ను ఎంచుకొని, కారణం రాసి Continueపై క్లిక్ చేయండి.
⚖️ స్టెప్ 4: గ్రీవెన్స్ దాఖలు చేయడం
- Do you want to remove Survey Number from CARD prohibited list? అనే ఆప్షన్ వస్తుంది. Yes/No ఎంచుకోండి.
- సర్వే నంబర్‌ను ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణం రాయండి.
- మీ కమ్యూనికేషన్ వివరాలు మరియు డాక్యుమెంట్ వివరాలు ఎంటర్ చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి Submitపై క్లిక్ చేయండి.
📩 స్టెప్ 5: ధృవీకరణ & సమర్పణ
- సబ్మిట్ చేసిన తర్వాత ఒక Confirmation Pop-up వస్తుంది. ఇప్పుడు OKపై క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ విజయవంతంగా సమర్పించబడుతుంది.
- ఒక Application Number జనరేట్ అవుతుంది.
- ఈ అప్లికేషన్ MeeSeva వద్ద eKYC కోసం పెండింగ్‌లో ఉంటుంది.
- OKపై క్లిక్ చేసి మీ సేవ దగ్గరికి వెళ్ళి eKYC పూర్తిచేయండి.
- Advertisement -




