Thursday, December 5, 2024
HomeAutomobileAther New Model 2022 e-Scooter: ఆన్‌లైన్‌లో లీకైన కొత్త ఏథర్ ఎనర్జీ ఈ-స్కూటర్ వివరాలు.....

Ather New Model 2022 e-Scooter: ఆన్‌లైన్‌లో లీకైన కొత్త ఏథర్ ఎనర్జీ ఈ-స్కూటర్ వివరాలు.. రేంజ్ ఎంతో తెలుసా?

Ather New Model 2022 e-Scooter: దేశంలో గత కొన్ని ఏళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరగడానికి ఒక కారణంగా పేర్కొనవచ్చు. మిలొ ఎవరైనా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా?, అయితే మీకు శుభవార్త. ఎందుకంటే, ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Ather Energy మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటి వరకు సంస్థ నుంచి విడుదలైన స్కూటర్లతో పోలిస్తే ఇది అన్నీ విషయాలలో మెరుగైన పనితీరు కనబరిచింది.

ఇప్పటికే ఓలా ఎస్1 ప్రొ(Ola S1 Pro) అమ్మకాల్లో ముందంజలో ఉండటం, టీవీఎస్ మోటార్స్ కూడా iQube S, iQube ST పేరుతో 2 అధిక రేంజ్ గల స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తుంది. దీంతో Ather Energy కూడా మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకోవడం కోసం సరి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తుంది.

Ather Energy 2022 New Electric Scooter

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏథర్ ఎనర్జీ ప్రైమరీ సెల్లర్ 450ఎక్స్ పోలిస్తే 2022 Ather Energy కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కి కొన్ని అదనపు ఫీచర్లు, స్పెసిఫికేషన్ లతో రాబోతుంది. ఈ ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్’కి సంబంధించిన వివరాలు బయట నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పూణేలోని ఏఆర్ఏఐ(ఆటోమోటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా)లో Ather Energy దాఖలు చేసిన లీకైన అప్రూవల్ డాక్యుమెంట్ ప్రకారం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ గణనీయంగా పెరిగింది.

2022 Ather New Electric Scooter స్పెసిఫికేషన్స్

త్వరలో విడుదల కాబోయే కొత్త Ather ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.66kW లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ప్రస్తుత Ather Energy 450X 2.6kW యూనిట్ గా ఉంది. బ్యాటరీ సామర్ధ్యం పెరగడం వల్ల స్కూటర్ రేంజ్ కూడా పెరగనుంది. ఏఆర్ఏఐకు దాఖలు చేసిన అప్రూవల్ డాక్యుమెంట్ ప్రకారం దీని రేంజ్ 146 కిమీగా ఉంది. కానీ, వాస్తవ పరిస్థితులలో దీని రేంజ్ 100 – 110 కిమీ మధ్యలో ఉండే అవకాశం ఉంది.

Source: Rushlane

ప్రస్తుతం ఏథర్ 450ఎక్స్ లో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, 4.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ 4జీ ఎల్టీఈ సిమ్ కనెక్టివిటీ, ఆన్బోర్డ్ నావిగేషన్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, మ్యూజిక్ అండ్ కాల్ కంట్రోల్స్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ పై హార్డ్ వేర్ సెటప్లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ లు, రియర్ మోనో-షాక్ మరియు రెండు వీల్స్ పై డిస్క్ బ్రేకులు ఉంటాయి. దీని ధర ప్రస్తుత స్కూటర్ ధరతో పోలిస్తే 10 నుంచి 20 వేల వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

(ఇంకా చదవండి: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్ ధర ఇంత తక్కువ..?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles