Friday, December 6, 2024
HomeAutomobileBestune Xiaoma Mini EV Car: ఆదిరిపోయిన బెస్ట్యూన్ షావోమి ఎలక్ట్రిక్ కారు.. రేంజ్, ధర...

Bestune Xiaoma Mini EV Car: ఆదిరిపోయిన బెస్ట్యూన్ షావోమి ఎలక్ట్రిక్ కారు.. రేంజ్, ధర ఎంతో తెలుసా?

Bestune Xiaoma Mini EV Car Details in Telugu: చైనాకు చెందిన ఫస్ట్ ఆటో వర్క్స్(First Auto Works) అనే సంస్థ తన షావోమా బెస్ట్యూన్ బ్రాండ్ కింద మినీ ఎలక్ట్రిక్ కారుని రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్, ధర తెలిస్తే ప్రతి ఒక్కరి మతి పోవడం ఖాయం. ఈ షావోమా బెస్ట్యూన్ కారు ప్రి సేల్స్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మినీ ఎలక్ట్రిక్ కారు చైనాలో వూలింగ్ హ్వాంగ్వాంగ్(Wuling Hongguang) మినీ ఎలక్ట్రిక్ కారుతో పోటీ పడనుంది.

షావోమి ఎలక్ట్రిక్ కారు కారు ధర:

ఈ ఫస్ట్ ఆటో వర్క్స్ రూపొందించిన బెస్ట్యూన్ కారు ధర భారతీయ కరెన్సీలో రూ. 3.47 లక్షల నుంచి రూ. 5.78 లక్షల వరకు ఉండనుంది. ప్రస్తుతానికి ఈ షావోమా ఎలక్ట్రిక్ కారును చైనాలో మాత్రమే లాంచ్ చేశారు. త్వరలో గ్లోబల్’గా లాంచ్ చేయనున్నారు.

షావోమి బెస్ట్యూన్ ఈవీ కారు రేంజ్:

ఈ కారును ఏప్రిల్ నెలలో జరిగిన షాంఘై ఆటో షోలో తొలిసారి చూపించారు. ఈ ఎలక్ట్రిక్ కారు హార్డ్ టాప్, కన్వర్టబుల్ వేరియంట్లలో మీకు లభిస్తుంది. కన్వర్టబుల్ వేరియంట్ కారును ఇంకా లాంచ్ చేయలేదు. ఈ కారు సింగిల్ చార్జింగ్ చేస్తే 1200 కిలోమీటర్లు ప్రయాణించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

వూలింగ్ హ్వాంగ్వాంగ్ కంపెనీతో పోటీ:

చైనాలో వూలింగ్ హాంగ్వాంగ్(Wuling Hongguang) మినీ ఎలక్ట్రిక్ కారు మార్కెట్ను శాశిస్తుంది. చిన్న ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో ఆ కంపెనీ కారుకు గట్టి పోటీ ఇచ్చేందుకు షావోమా బెస్ట్యూన్ తన కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీనిలో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్యుయల్ టోన్ థీమ్ డాష్ బోర్డు ఉన్నాయి.

- Advertisement -

(ఇది కూడా చదవండి: Tata Nano EV Price in Telugu: త్వరలో మార్కెట్లోకి టాటా నానో ఎలక్ట్రిక్ కార్… ధరెంతో తెలుసా?)

ఇది బాక్సి టైప్ డిజైన్ తో వస్తుంది. ఈ కారుకు స్క్వేర్ హెడ్ లైన్స్, రౌండెడ్ కార్న ర్స్, ఎయిరో డైనమిక్ వీల్స్ ఉన్నాయి. దీనికి ఉన్న ప్రత్యేక టెయిల్ ల్యాంప్స్, బంపర్స్ తో కారు వెనకవైపు డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో ఈ కారులో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీ ఉంది. దీనిలో సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles